‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi

‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country: PM Modi

December 16th, 08:08 pm

PM Modi interacted and addressed the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister expressed gratitude for getting the opportunity to flag off the Viksit Bharat Sankalp Yatra in the five states of Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and Mizoram, and remarked that the ‘Modi Ki Guarantee’ vehicle is now reaching all parts of the country

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

December 16th, 04:00 pm

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఐదు రాష్ర్టాల్లో-రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం-వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభించే అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు ‘‘మోదీ కీ గ్యారంటీ’’ వాహనం దేశంలోని అన్ని రాష్ర్టాలకు చేరుతున్నదని చెప్పారు. నెల రోజుల ప్రయాణంలో విబిఎస్ వై వేలాది గ్రామాలతో పాటు 1500 చిన్న, పెద్ద నగరాలను తిరిగి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ఇంతకు ముందు విబిఎస్ వైను ప్రారంభించలేకపోయినట్టు చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను తమ రాష్ర్టాల్లో విస్తరించాలని కొత్తగా ఎన్నికైన ఐదు రాష్ర్టాల ప్రభుత్వాలకు ప్రధానమంత్రి సూచించారు.

రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం

రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం

April 26th, 08:01 pm

అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.

న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం

April 26th, 08:00 pm

న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల తో జరిగిన జాతీయ శ్రమ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

August 25th, 04:31 pm

చండీగఢ్ పరిపాలకుడు శ్రీ బన్‌ వారీ లాల్ పురోహిత్ గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరులు శ్రీయుతులు భూపేందర్ యాదవ్ గారు, రామేశ్వర్ తేలి గారు లు, అన్ని రాష్ట్రాల కు చెందిన గౌరవనీయ శ్రమ శాఖ మంత్రులు, కార్మిక శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, మహిళ లు మరియు సజ్జనులారా, ముందుగా నేను భగవాన్ తిరుపతి బాలాజీ పాదాల కు ప్రణమిల్లదలచాను. మీరంతా విచ్చేసినటువంటి పవిత్రమైన ప్రదేశం భారతదేశం యొక్క శ్రమ మరియు సామర్థ్యాల కు ఒక సాక్షి గా నిలచింది. ఈ సమావేశం లో వ్యక్తం అయ్యే ఆలోచన లు దేశం లో శ్రమ శక్తి ని తప్పక మరింత గా బలపరుస్తాయి అని నేను భావిస్తున్నాను. నేను మీ అందరికీ ప్రత్యేకించి, శ్రమ మంత్రిత్వ శాఖ కు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అభినందనల ను తెలియజేస్తున్నాను.

దేశం లోని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 25th, 04:09 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ సదస్సులో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ రామేశ్వర్ తేలి, అన్ని రాష్ట్రాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు.

This time we are going to hit a 'Jeet Ka Chowka'...First in 2014, then 2017, 2019, and now 2022: PM Modi in Bahraich

February 22nd, 04:00 pm

Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”

PM Modi addresses a Vishal Jan Sabha in Bahraich, Uttar Pradesh

February 22nd, 03:59 pm

Prime Minister Narendra Modi addressed an election rally in Uttar Pradesh’s Bahraich. Elated to see a huge crowd in a public meeting, PM Modi said, “You have come in such a large number to bless the BJP, this time we are going to hit a 'Jeet Ka Chowka'... First in 2014, then 2017, 2019, and now 2022. People of UP have decided to reject 'Parivarvadis'.”

ఐక్యరాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ 76వ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

September 25th, 06:31 pm

అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించినందుకు మీకు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. మీరు అధ్య‌క్షులు కావ‌డం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగం

September 25th, 06:30 pm

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలలో, కోవిడ్ -19 మహమ్మారి, తీవ్రవాదం మరియు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ప్రపంచ సవాళ్లపై దృష్టి పెట్టారు. మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో భారతదేశం పోషించిన పాత్రను ఆయన ఎత్తి చూపారు మరియు భారతదేశంలో వ్యాక్సిన్‌లను తయారు చేయమని ప్రపంచాన్ని ఆహ్వానించారు.

యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్స్ ప్రో్గ్రామ్ ను ప్ర‌శంసించిన యుఎన్ డిపి నివేదిక‌. ప్ర‌పంచంలోని ఇత‌ర ప్రాంతాలు ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చ‌ని సిఫార్సు చేసిన నివేదిక‌.

June 11th, 07:21 pm

జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ( ఏడిపి) చ‌క్క‌టి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని తెలియ‌జేస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్ వారి నివేదిక ప్రశంస‌లు గుప్పించింది. ప‌లు కార‌ణాల‌వ‌ల‌న స్థానికంగా అభివృద్ధి లోపించి, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వివ‌క్ష‌కు గురైన ప్రాంతాల్లో ఈ ఏడిపి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌కు యుఎన్ డిపి సిఫార‌సు చేసింది.

అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

February 07th, 11:41 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అస్సాంలో రెండు ఆస్ప‌త్రుల‌కు పునాదిరాళ్ళు వేసి, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకిజులి ప్రాంతం వ‌ద్ద రాష్ట్ర‌ర‌హ‌దారులు, ప్ర‌ధాన జిల్లా ర‌హ‌దారుల కోసం అసోమ్ మాలా అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అస్సాం ముఖ్య‌మంత్రి శ్రీ శ‌ర‌బానంద సోనోవాల్‌, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వ‌ర్ తేలి, అస్సాం ప్ర‌భుత్వ మంత్రులు, బోడోలాండ్ టెరిటోరియ‌ల్ రీజన్ చీఫ్ శ్రీ ప్ర‌మోద్‌బోరో పాల్గొన్నారు.

అసోం మాలాను ప్రారంభించి రెండు ఆసుప‌త్రుల నిర్మాణానికి పునాది రాళ్లు వేసిన ప్రధానమంత్రి

February 07th, 11:40 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అస్సాంలో రెండు ఆస్ప‌త్రుల‌కు పునాదిరాళ్ళు వేసి, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకిజులి ప్రాంతం వ‌ద్ద రాష్ట్ర‌ర‌హ‌దారులు, ప్ర‌ధాన జిల్లా ర‌హ‌దారుల కోసం అసోమ్ మాలా అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అస్సాం ముఖ్య‌మంత్రి శ్రీ శ‌ర‌బానంద సోనోవాల్‌, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వ‌ర్ తేలి, అస్సాం ప్ర‌భుత్వ మంత్రులు, బోడోలాండ్ టెరిటోరియ‌ల్ రీజన్ చీఫ్ శ్రీ ప్ర‌మోద్‌బోరో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ వీధి వ్యాపారులతో ప్రధానమంత్రి సంభాషణ

September 09th, 11:01 am

కేంద్ర మంత్రిర్గ సహచరుడు శ్రీ హర్ దీప్ సింగ్ పూరీ జీ! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భాయ్ శివరాజ్ సింగ్ జీ! రాష్ట్ర మంత్రివర్గంలోని మిగతా సభ్యులకు, పరిపాలనా యంత్రాగంతో ప్రమేయం ఉన్న అందరికీ, ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులందరికీ,మధ్యప్రదేశ్ నుంచి, మిగతా ప్రాంతాలనుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా ప్రియమైన సోదర, సోదరీమణులకు…

మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ ను నిర్వహించిన ప్రధాన మంత్రి

September 09th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధుల్లో తిరుగుతూ సరుకులను విక్రయించే పేద వ్యాపారులు కోవిడ్-19 సంక్షోభకాలం లో ఇబ్బందుల పాలవడంతో, వారు మళ్లీ వారి జీవనోపాధి కార్యకలాపాలను ఆరంభించుకొనేందుకు సాయపడే ఉద్దేశంతో పిఎం స్వనిధి పథకాన్ని భారత ప్రభుత్వం 2020 జూన్ 1 న ప్రారంభించింది. మధ్య ప్రదేశ్ లో 4.5 లక్షల మంది వీధి వర్తకులు ఈ పథకం లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో దాదాపు గా 1.4 లక్షల వీధి వ్యాపారస్తుల కు 140 కోట్ల రూపాయల విలువైన సొమ్ము ను మంజూరు చేయడానికి ఆమోదం తెలపడమైంది.

Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi

February 16th, 01:01 pm

PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.

దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి; దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ మెమోరియ‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకిత‌మిచ్చారు

February 16th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణ‌సీ లో దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అలాగే దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ స్మార‌క కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు. మూడు జ్యోతిర్లింగ యాత్రా స్థ‌లాలు వారాణ‌సీ ని, ఉజ్ై పన్ ను, ఓంకారేశ్వ‌ర్ ను క‌లుపుతూ ప్రయాణించే మూడో కార్పొరేట్ రైలు అయిన ‘మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్’కు ప్రారంభ సూచ‌క జెండా ను చూపారు. 430 ప‌డ‌క‌ల తో సూప‌ర్ స్పెశల్టి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ తో స‌హా అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాలు ముప్ఫైఆరిటి ని ఆయ‌న ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాల కు శంకుస్థాపన లు చేశారు.

ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 04th, 03:09 pm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.

ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 04th, 03:08 pm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.

‘ప్ర‌గ‌తి’ 32వ ముఖాముఖి స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

January 22nd, 05:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020వ సంవ‌త్స‌రం లో ఈ రోజు న జ‌రిగిన మొదటి ‘ప్రగతి’ స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి స‌మావేశం ఇది.