ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్ర‌ధాన మంత్రి సంభాషణ

January 23rd, 06:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బిపి) అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ప్రధాన మంత్రి ప్రతి అవార్డు గ్రహీతకు స్మారక చిహ్నాలను అందించి, ఆపై వారితో ఫ్రీవీలింగ్ ఇంటరాక్షన్‌- ఇష్టాగోష్ఠిలో నిమగ్నమయ్యారు. అవార్డుకు ఎంపికైనందుకు పిల్లలు తమ విజయాల వివరాలను పంచుకున్నారు. సంగీతం, సంస్కృతి, సౌరశక్తి, బ్యాడ్మింటన్, చెస్ వంటి వివిధ విషయాలపై చర్చించారు.

‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం’ విజేతలకు ప్రధాని ప్రశంసలు

January 24th, 09:49 pm

ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం విజేతలను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. “ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం” సంబంధిత విభాగాల్లో విశిష్ట విజయాలు సాధించిన బాలలకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌” ((పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. ఈ మేరకు ‘పీఎంఆర్‌బీపీ-2023’కుగాను బాలశక్తి పురస్కార్‌లోని వివిధ కేటగిరీల కింద దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 11 మంది బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలున్నారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ

January 24th, 07:38 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో సంభాషించారు.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ విజేతల తో జనవరి 24 వ తేదీ న సమావేశం కానున్న ప్రధాన మంత్రి

January 23rd, 03:00 pm

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్ బిపి) విజేతల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జనవరి 24 వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల వేళ లో తన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో సమావేశం కానున్నారు.