బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఒకరోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
July 25th, 01:38 pm
బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరిత గతి న కోలుకోవాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు. స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 16th, 01:23 pm
హనుమంతుడు కాలనేమిని సంహరించిన భూమిలోని ప్రజలకు నేను నమస్కరిస్తున్నాను. 1857లో జరిగిన పోరాటంలో ఈ ప్రాంత ప్రజలు బ్రిటీష్ వారితో ధైర్యంగా పోరాడారు. స్వాతంత్య్ర పోరాట పరిమళాన్ని వెదజల్లుతున్న నేల. కొయిరిపూర్ యుద్ధాన్ని ఎవరు మర్చిపోగలరు? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే బహుమతిని ఈ రోజు ఈ పవిత్ర భూమికి అందజేస్తోంది. మీ అందరికీ చాలా అభినందనలు.పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 16th, 01:19 pm
పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. సుల్తాన్ పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా నిర్మాణం జరిగిన 3.2 కి.మీ. పొడవైన ఎయర్ స్ట్రిప్ మీదుగా సాగిన ఎయర్ శో ను కూడా ఆయన తిలకించారు.నవంబర్ 16 నఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి ; పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ఆయన ప్రారంభిస్తారు
November 15th, 11:16 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 16న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు గా మధ్యాహ్నం ఒంటి గంటన్నర వేళ కు సుల్తాన్ పుర్ జిల్లా లోని కర్ వల్ ఖీరీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే ను ఆయన ప్రారంభిస్తారు.పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
February 16th, 02:45 pm
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 16th, 11:24 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.మహారాజా సుహేల్ దేవ్ స్మారకాని కి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 11:23 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.Government determined to preserve legacy of all those who contributed to India's defence and security and to its social life: PM
December 29th, 12:15 pm
PM Modi laid the foundation stone of a medical college in Ghazipur today. Addressing a public meeting at the occasion, PM Narendra Modi spoke at length about government's efforts towards improving healthcare infrastructure and ensuring housing for all.ఘాజీపూర్‌లో ప్రధానమంత్రి
December 29th, 12:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌ను సందర్శించారు. అక్కడ ఆయన మహారాజా సుహెల్దేవ్ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. అలాగే ఘాజిపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
July 14th, 06:28 pm
వారణాసిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, వారణాసిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు పని పూర్తిగా మొదలైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితో పాటు పది ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది.వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
July 14th, 06:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు (జూలై 14,2018) వారణాసిలో సుమారు 900 కోట్ల రూపాయల విలువగల పలు ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులలో వారణాసి సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు, వారణాసి- బాలియా మెమూ రైలు ప్రాజెక్టు ఉన్నాయి.శంకుస్థాపన చేసిన వాటిలో పంచకోషి పరిక్రమ మార్గ్ , స్మార్ట్‌సిటీ మిషన్, నమామి గంగే పథకం కింద చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వారణాసిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌కు కూడా ప్రధానమంత్ర శంకుస్థాపన చేశారు.ఆజంఘడ్ లో పూర్వాన్చల్ ఎక్స్ప్రెస్వేకి పునాది వేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
July 14th, 04:14 pm
ఆజంఘడ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే కు పునాది వేసిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఎన్డిఎ ప్రభుత్వం గురించి మాట్లాడారు, ఈ ప్రాంతంలోని ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు అనుసంధానతను పెంచడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ పై బిల్లును అడ్డుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.అజామ్‌ఘడ్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ
July 14th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు (జూలై 14,2018) ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘడ్‌లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే కు శంకుస్థాపన చేశారు.