పొంగల్సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

January 15th, 09:36 am

పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శుబాకాంక్షల ను తెలియజేశారు.

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం

January 14th, 12:00 pm

వనక్కం, మీ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు! ఇనియా పొంగల్ నల్వాల్తుక్కల్ !

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

January 14th, 11:30 am

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులోని ప్రతీ ఒక్క ఇంటిలోనూ పొంగల్ పండుగ ఉత్సాహం కనిపిస్తుందని ఆయన అన్నారు. పౌరులందరి జీవితాల్లోనూ ఆనందం, సుసంపన్నత, సంతృప్తి ఏరులై పారాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. నిన్న జరిగిన లోహ్రి వేడుకలు, మకర ఉత్తరాయణ ప్రవేశాన్ని పురస్కరించుకుని రేపు జరిగే మకర సంక్రాంతి, త్వరలో రానున్న మాఘ బిహు వంటి పవిత్ర పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.

సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 15th, 10:30 am

తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ గారు, టి. శ్రీనివాస యాదవ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు, నా స్నేహితుడు బండి సంజయ్ గారు, కె. లక్ష్మణ్ గారూ, ఇతర ప్రముఖులందరూ, స్త్రీలు మరియు పెద్దమనుషులు.

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన ప్రధాని

January 15th, 10:11 am

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఎనిమిదవ వందే భారత్ రైలు ఇది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 700 కిలోమీటర్లు నడిచే రైలు కూడా కావటం గమనార్హం. ఈ రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుతుంది.

పొంగల్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా- తమిళ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

January 15th, 09:42 am

పొంగల్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ.. ప్రత్యేకించి తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ ప్రారంభోత్సవం, వారణాసిలో టెంట్ సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 13th, 10:35 am

ఈ రోజు లోహ్రీ పండుగ. రాబోయే రోజుల్లో ఉత్తరాయణం, మకర సంక్రాంతి, భోగి, బిహు, పొంగల్ వంటి అనేక పండుగలను జరుపుకుంటాం. దేశంలో, ప్రపంచంలో ఈ పండుగలను జరుపుకునే వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

వారాణసీ లో ప్రపంచం లోకెల్లా అతి దీర్ఘమైన నదీ జల యాత్ర - ఎమ్.వి గంగావిలాస్ కు ప్రారంభసూచక పచ్చ జెండా ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా చూపెట్టిన ప్రధాన మంత్రి

January 13th, 10:18 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లోనే అతి పెద్దదైన నదీ జల యాత్ర ఎమ్ వి గంగా విలాస్ కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు. దీనితో పాటే వారాణసీ లో టెంట్ సిటీ ని కూడా ఆయన ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఒక వేయి కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక ఇతర అంతర్ దేశీయ జలమార్గ పథకాల ను ఆయన ప్రారంభించడం తో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేశారు. నదీ జలాల లో విహారాని కి సంబంధించిన పర్యటన రంగాని కి ఉత్తేజాన్ని అందించాలనే ప్రధాన మంత్రి ప్రయత్నానికి అనుగుణం గా ఈ యొక్క సర్వీసు మొదలవడం తో, నదీ జలయాత్ర లకు సంబంధించిన ఇంతవరకు వినియోగం లోకి రానటువంటి సంభావ్యత లు ఇక మీదట ఆచరణ రూపాన్ని దాల్చనున్నాయి. మరి ఇది భారతదేశం లో నదీ విహార ప్రధాన పర్యటన ల తాలూకు ఒక సరికొత్త యుగాన్ని ఆవిష్కరించనుంది.

మకర సంక్రాంతి.. ఉత్తరాయణం.. భోగి.. మాఘ్‌ బిహు.. పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్షలు

January 14th, 10:24 am

“భారతదేశంలో ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే వివిధ పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. తదనుగుణంగా ఆయా పండుగ చేసుకుంటున్న ప్రజలకు ప్రత్యేకంగా సందేశం పంపారు.

కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ ప్ర‌గ‌తిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాల‌నాధిప‌తుల‌తో సమగ్ర ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించిన ప్ర‌ధాని

January 13th, 05:31 pm

దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాల‌నాధిప‌తుల‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త‌న అధ్య‌క్ష‌త‌న సమగ్ర ఉన్నత స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్‌ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ ప్ర‌గ‌తిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాల‌నాధిప‌తుల‌తో సమగ్ర ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించిన ప్ర‌ధాని

January 13th, 05:30 pm

దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్య‌క్ర‌మ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాల‌నాధిప‌తుల‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త‌న అధ్య‌క్ష‌త‌న సమగ్ర ఉన్నత స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్‌ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

తమిళనాడులో 11 నూతన మెడికల్ కాలేజీలు మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 12th, 03:37 pm

తమిళనాడు గవర్నర్, శ్రీ ఆర్‌ఎన్‌రవి, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్, కేబినెట్ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య, మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, భారతీ పవార్ జీ, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, తమిళనాడు అసెంబ్లీ సభ్యులు, తమిళనాడు సోదరీసోదరులారా, వనక్కం! మీ అందరికీ పొంగల్, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభిస్తాను. ప్రసిద్ధ పాట సాగినట్లు -

తమిళనాడులో 11 వైద్య కళాశాలలు.. ‘సీఐసీటీ’ కొత్త ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం

January 12th, 03:34 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులో 11 కొత్త వైద్య కళాశాలలతోపాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) కొత్త ప్రాంగణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు డాక్టర్ ఎల్.మురుగన్, డాక్టర్ భారతి పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- రాష్ట్రంలో 11 వైద్య క‌ళాశాల‌లతోపాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసిక‌ల్ త‌మిళ్ కొత్త భ‌వ‌నం ప్రారంభంతో తమిళ సమాజ ఆరోగ్యం ఉన్నతస్థాయికి చేరడమేగాక మనదైన సంస్కృతితో అనుబంధం మరింత దృఢమవుతుందని అన్నారు.

కోవిడ్ పరిస్థితిని, టీకాలకు సంసిద్ధతను సమీక్షించిన ప్రధాని

January 09th, 05:42 pm

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ టీకాల పంపిణీకి సంసిద్ధతను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి కాబినెట్ కార్యదర్శి, ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. కోవిడ్ కి సంబంధించిన అన్ని అంశాలమీద ప్రధాని సమగ్రంగా చర్చించి సమీక్షించారు. సురక్షితమని సంబంధిత నియంత్రణా సంస్థ ధ్రువీకరించిన కోవి షీల్డ్, కొవాక్సిన్ అనే రెండు టీకాలను వాడటానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.

స్వచ్ఛతా మాదిరిగా, నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యాన్ని చూస్తోంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 26th, 04:48 pm

సంవత్సరం మొదటి మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాని మోదీ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తోటి దేశస్థులను పలకరించారు. మన్ కీ బాత్ కలిసి పంచుకోవడం, నేర్చుకోవడం మరియు కలిసి పెరగడం గురించి ఒక వేదికగా ఎలా మారిందో ప్రధాని మోదీ మాట్లాడారు. నీటి సంరక్షణ, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, బ్రూ-రీయాంగ్ రెఫ్యూజీ సంక్షోభం, గగన్యాన్ మరియు పద్మ అవార్డులను ముగించే చారిత్రక ఒప్పందం వంటి అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు.

భారతదేశం అంతటా వివిధ పండుగ ల సందర్భం గా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

January 14th, 01:27 pm

భారతదేశ వ్యాప్తం గా విభిన్నమైన పండుగల ను పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi interacts with booth Karyakartas from Mayiladuthurai, Perambalur, Sivaganga, Theni & Virudhunagar

January 13th, 12:34 pm

Prime Minister Narendra Modi interacted with BJP booth workers from Mayiladuthurai, Perambalur, Sivaganga, Theni and Virudhunagar in Tamil Nadu today.

ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి భార‌త ప‌ర్య‌ట‌న ( 2018 జ‌న‌వ‌రి 15 ) సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

January 15th, 02:00 pm

భార‌త‌దేశాన్ని సందర్శించేందుకు మొట్టమొదటి సారిగా విచ్చేసినటువంటి ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు స్వాగ‌తం పలకడం గొప్ప ఆనందాన్నిస్తోంది.

దేశవ్యాప్తంగా వివిధ పండుగలు నిర్వహించుకుంటున్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

January 14th, 03:26 pm

‘‘మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రకృతి-వ్యవసాయంతో ముడిపడిన ఈ పండుగ సందర్భంగా సకల జనులకూ భోగభాగ్యాలను, సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’

'సానుకూల భారతదేశం' నుండి 'ప్రగతిశీల భారతదేశం' వైపుకు ప్రయాణం ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 31st, 11:30 am

2017 నాటి 'మన్ కి బాత్' తుది ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతన సంవత్సరాన్ని ప్రజలు సానుకూల ధృక్పధంతో ఆహ్వానించమని కోరారు. నూతన యుగం 21 వ శతాబ్దపు ఓటర్లను గురించి ప్రధాని వివరించారు మరియు ఒక ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి చాలా గొప్పదని అది చాలామంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలదని ఆయన తెలిపారు.