కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

December 07th, 05:52 pm

పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 07th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

PM Modi's conversation with Lakhpati Didis in Jalgaon, Maharashtra

August 26th, 01:46 pm

PM Modi had an enriching interaction with Lakhpati Didis in Jalgaon, Maharashtra. The women, who are associated with various self-help groups shared their life journeys and how the Lakhpati Didi initiative is transforming their lives.

మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 25th, 01:00 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు... నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో హాయినిస్తోంది.

మ‌హారాష్ట్ర‌, జ‌ల‌గావ్‌లో నిర్వ‌హించిన‌ ల‌క్షాధికార సోద‌రీమ‌ణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

August 25th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్‌గావ్‌లో నిర్వ‌హించిన ల‌ఖ్ ప‌తి దీదీ స‌మ్మేళ‌న్ (ల‌క్షాధికార సోద‌రీమ‌ణుల స‌మావేశం)లో పాల్గొన్నారు. మూడో ప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇటీవ‌ల ల‌క్షాధికారులైన 11 ల‌క్ష‌ల‌మంది సోద‌రీమ‌ణుల‌కు ధ్రువ‌ ప‌త్రాల‌ను అందించి స‌త్క‌రించింది.

పోలిష్ కబడ్డీ క్రీడాకారులతో ప్రధాన మంత్రి సమావేశం

August 22nd, 09:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పోలాండ్ లోని వార్సాలో పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మీహాల్ ష్పిజ్ కోవ్, సభ్యురాలు అన్నా కాల్బార్చిక్ తో సమావేశమయ్యారు. పోలాండ్‌లో కబడ్డీని పురోగమనంలోనూ, యూరప్‌లో క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ ష్పిజ్ కోవ్, కాల్బార్చిక్‌లు అంకితభావంతో కృషి చేశారని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ప్రధాని అన్నారు.

‘బిలీనియం’ సీఈవో గవెల్ లోపిన్స్కితో ప్రధానమంత్రి సమావేశం

August 22nd, 09:22 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘బిలీనియం’ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గవెల్ లోపిన్స్కితో సమావేశమయ్యారు. ఇది మహారాష్ట్రలోని పుణె నగరంలోగల ప్రముఖ పోలాండ్ సమాచార సాంకేతిక రంగ కంపెనీ.

‘టిజడ్ఎంఒ’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో ప్రధానమంత్రి సమావేశం

August 22nd, 09:20 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లో విభిన్న పరిశుభ్రత ఉత్పత్తుల తయారీ సంస్థ ‘టిజడ్ఎంఒ’, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో సమావేశమయ్యారు.

పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టులతో ప్రధానమంత్రి సమావేశం

August 22nd, 09:18 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టుల (భారత చరిత్ర అధ్యయనకారులు)తో సమావేశమయ్యారు. ఈ బృందంలోని ప్రముఖులలో...:

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

August 22nd, 08:22 pm

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

వార్సాలోని అనామ‌క సైనిక స‌మాధివ‌ద్ద ప్ర‌ధాని ఘ‌న నివాళి

August 22nd, 08:12 pm

వార్సాలోని అనామ‌క సైనిక ( అన్ నౌన్ సోల్జ‌ర్‌) స‌మాధివ‌ద్ద ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఘ‌న నివాళి అర్పించారు.

పోలాండ్ ప్ర‌ధానితో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

August 22nd, 06:10 pm

ఫెడ‌ర‌ల్ ఛాన్స‌ల‌రీని చేరుకున్న ప్ర‌ధానికి పోలాండ్ ప్ర‌ధాని శ్రీ డోనాల్డ్ ట‌స్క్ సంప్ర‌దాయ‌బ‌ద్దంగా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వార్సాలోని దోబ్రీ మహారాజా స్మారకం వద్ద ప్రధానమంత్రి నివాళులు

August 21st, 11:57 pm

వార్సాలోని దోబ్రీ మహారాజా స్మారకం వద్ద బుధవారం ప్రధానమంత్రి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.

కొల్హాపూర్ స్మార‌కాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన‌మంత్రి

August 21st, 11:56 pm

వార్సాలోని కొల్హాపూర్ స్మారకం వ‌ద్ద బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళుల‌ర్పించారు.

మోంటె కేసినో యుద్ధ స్మారక కట్టడం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

August 21st, 11:55 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వార్సా లో బుధవారం మోంటె కేసినో యుద్ధ స్మారకానికి చేరుకొని, ఒక పూల హారాన్ని అక్కడ ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 21st, 11:45 pm

ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.

వార్సాలో ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

August 21st, 11:30 pm

ప్రధానమంత్రికి ప్రవాస భార‌తీయులు ఆత్మీయ‌త‌తో, ఉత్సాహంతో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 45 ఏళ్ల త‌ర్వాత భార‌త ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భార‌త్‌-పోలండ్‌ సంబంధాలను బ‌లోపేతం చేసేందుకు పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో స‌మావేశానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భార‌త్ త‌ల్లివంటిద‌ని, పోలండ్‌తో భార‌తదేశపు విలువ‌ల‌ను పంచుకోవ‌డం వ‌ల్ల రెండు దేశాలు చేరువ‌య్యాయ‌ని అన్నారు.