మేఘాలయాలోని షిల్లాంగ్ లో పలు అభివృద్ధి కార్యకమాల ;ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
December 18th, 04:22 pm
ఖుబ్లీ శిబాన్ (ఖాసి, జైన్తియాలలో అభినందనలు), నమెంగ్ అమాల్ (గారోలో అభినందనలు). మేఘాలయా ఎంతో విలువైన సహజ వనరులు, సంస్కృతి గల రాష్ట్రం. మీ ఆతిథ్యంలో కూడా ఈ గొప్పదనం కనిపిస్తుంది. మేఘాలయ అభివృద్ధి ప్రయాణ విజయాలను నిర్వహించుకోవడానికి జరుపుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం మరో సారి వచ్చింది. అనుసంధానత, విద్య, నైపుణ్యాలు, ఉపాధికి చెందిన పలు ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు.మేఘాలయలోని షిల్లాంగ్ లో 2450 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 18th, 11:15 am
ప్రారంభోత్సవాలు చేసి వాటిని జాతికి అంకితం చేశారు.అంతకు ముందు ప్రధానమంత్రి షిల్లాంగ్లో స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఈ కౌన్సిల్ స్వర్ణోత్సవాలలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. 320 పూర్తిచేసుకున్న 4 జి మొబైల్ టవర్లు, 890 నిర్మాణంలోని మొబైల్ టవర్లు, ఉమ్సాలిలో ఐఐఎం షిల్లాంగ్ కొత్త క్యాంపస్,కొత్త షిల్లాంగ్ టౌన్షిప్కు మరింత మెరుగైన అనుసంధానతను కల్పించే షిలలాంగ్–దీంగ్ పోష్ రోడ్, మూడు రాష్ట్రాల లో అంటే మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో నాలుగు ఇతర రోడ్డు ప్రాజెక్టులు ప్రధానమంత్రి ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. ప్రధానమంత్రి మేఘాలయలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం, పుట్టగొడుగుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. మిజోరం, మణిపూర్, త్రిపుర, అస్సాంలలో 21 హిందీ లైబ్రరీలనుఅస్సాంలో క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 28th, 02:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి జీ, అసోం ప్రముఖ మరియు శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సీనియర్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ మరియు శ్రీ రామేశ్వర్ తేలి జీ, దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ రతన్ టాటా జీ, అస్సాం ప్రభుత్వంలోని మంత్రులు, శ్రీ కేశబ్ మహంతా జీ, అజంతా నియోగ్ జీ మరియు అతుల్ బోరా జీ, ఈ నేల పుత్రుడు శ్రీ రంజన్ గొగోయ్ జీ, న్యాయ రంగంలో అద్భుతమైన సేవలు అందించారు మరియు పార్లమెంటులో చట్టాలను రూపొందించే ప్రక్రియలో మాకు సహాయపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులారా!ఏడు కేన్సర్ ఆసుపత్రులను జాతికి అంకితం చేసిన ప్రధాని; అస్సాంలో మరో ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన
April 28th, 02:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దిబ్రూగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అస్సాంలో ఏర్పాటు చేసిన 6 కేన్సర్ ఆస్పత్రులను జాతికి అంకితం చేశారు. దిబ్రూగఢ్, కోక్రఝార్, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో ఇవి నిర్మితమయ్యాయి. కాగా, వీటిలో దిబ్రూగఢ్ కొత్త ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా ప్రధాని నిన్ననే దీన్ని జాతికి అంకితం చేశారు. మరోవైపు ఈ ఆస్పత్రుల ప్రాజెక్టు రెండో దశ కింద ధుబ్రి, నల్బరి, గోల్‌పడా, నౌగావ్, శివసాగర్, తీన్‌సుకియా. గోలాఘాట్‌లలో నిర్మించనున్న ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ రామేశ్వర్ తేలి, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు శ్రీ రంజన్ గొగోయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.