‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని పోయడం) కార్యక్రమం లో భాగంగా ఒక మొక్కను నాటిన ఉపరాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ప్రశంసలు

July 27th, 10:04 pm

భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని అందించడం ప్రేరణదాయకంగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం

June 14th, 09:54 pm

మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.

జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 14th, 09:41 pm

ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.