గ్లోబల్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ ఇన్ వెస్ట్ మంట్ (పిజిఐఐ) మరియు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్కారిడర్ ల కోసం భాగస్వామ్యం
September 09th, 09:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ లు 2023 సెప్టెంబరు 9 వ తేదీ న న్యూ ఢిల్లీ లో జి-20 శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతున్న నేపథ్యం లో, గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ ఇన్ వెస్ట్ మంట్ (పిజిఐఐ) మరియు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్ కారిడర్ ల కోసం భాగస్వామ్యం అంశం పై ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమాని కి సంయుక్తం గా అధ్యక్షత ను వహించారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (పి.జి.ఐ.ఐ) & ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కోసం భాగస్వామ్యంపై జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు - తెలుగు అనువాదం
September 09th, 09:27 pm
మహనీయులు, గౌరవనీయులైన మీ అందరికీ, ఈ ప్రత్యేక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఈ కార్యక్రమానికి సహ-అధ్యక్షుడిగా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు, ఒక ముఖ్యమైన, చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. రాబోయే కాలంలో, ఇది భారతదేశం, పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారనుంది.