స్ఫూర్తిదాయక వ్యక్తులను పద్మ పురస్కారాలకు నామినేట్ చేయండి: ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన

September 09th, 06:00 pm

ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల కోసం నామినేషన్ల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.

పద్మ పురస్కారాల కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి

March 21st, 10:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పద్మ పురస్కారాల ప్రదానం కార్యక్రమాని కి హాజరయ్యారు. ఆ పురస్కారాల ను జీవన యాత్ర లో విభిన్న వర్గాల కు చెందిన విశిష్ట వ్యక్తుల కు ఇవ్వడమైంది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన జన జాతీయ గౌరవ్ దివాస్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 15th, 01:05 pm

తన జీవితమంతా గిరిజన సమాజ సంక్షేమం కోసం వెచ్చించిన శ్రీ మంగూభాయ్ పటేల్ జీకి మధ్యప్రదేశ్ తొలి గిరిజన గవర్నర్ గౌరవం దక్కడం నాకు గర్వకారణం. తన జీవితాంతం, అతను మొదట ఒక సామాజిక సంస్థ ద్వారా అంకితమైన గిరిజన 'సేవక్'గా కొనసాగాడు మరియు తరువాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు.

జనజాతీయ గౌరవ దినోత్సవ మహా సమ్మేళనంలో జనజాతీయ సామాజిక సంక్షేమం కోసం పలు కీలక పథకాలను ప్రధానమంత్రి శ్రీకారం

November 15th, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జనజాతీయ గౌరవ దినోత్సవ మహా సమ్మేళనంలో భాగంగా జనజాతీయ సామాజిక వర్గం సంక్షేమం లక్ష్యంగా పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో ‘రేషన్ ఆప్కే గ్రామ్’ పథకానికీ ప్రధాని శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ‘మధ్యప్రదేశ్‌ సికిల్‌ సెల్‌ (ఎర్రరక్తకణ అవకరం) మిషన్‌’ను కూడా ఆయన ప్రారంభించారు. అటుపైన దేశవ్యాప్తంగా 50 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌, ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌సహా శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ ప్రహ్లాద్‌ ఎస్‌.పటేల్‌, శ్రీ ఫగ్గన్‌ సింగ్‌ కులస్థే, డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ కూడా పాల్గొన్నారు.

ప‌ద్మ అవార్డుల కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానికి బ‌హుమ‌తినిచ్చిన ప‌ద్మ అవార్డు గ్ర‌హీత దులారీదేవీజీ దులారీదేవీజీ అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

November 11th, 10:13 pm

ప‌ద్మ అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మంలో ప‌ద్మ అవార్డు గ్ర‌హీత దులారీజీ శ్రీ న‌రేంద్ర మోదీకి బ‌హుమ‌తినివ్వ‌డంద్వారా ప్ర‌ధానిప‌ట్ల‌ త‌న అపార‌మైన‌ అభిమానం ప్ర‌ద‌ర్శించారు..ఆమె క‌న‌బ‌రిచిన ఈ అభిమానం చూసి చ‌లించిన ప్ర‌ధాని ఆమెకు త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల నామినేష‌న్ (పీపుల్స్ ప‌ద్మ‌)విభాగంలో ఆమె ప‌ద్మ అవార్డు పొందిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ప్ర‌ధాని త‌న ట్వీట్ లో ఇలా అన్నారు. పీపుల్స్ ప‌ద్మ అందుకున్నవారిలో దులారీదేవీజీ వున్నారు. బిహార్ లోని మ‌ధువ‌నికి చెందిన ఆమె ప్ర‌తిభావంత‌మైన క‌ళాకారిణి. ఆమె ప్రేమ‌పూర్వ‌కంగా ఇచ్చిన బ‌హుమ‌తిని అందుకోవ‌డం సంతోషాన్నిచ్చింది. ప‌ద్మ అవార్డుల కార్య‌క్ర‌మం పూర్త‌యిన త‌ర్వాత జ‌రిగిన ఇష్టాగోష్ఠిలో ఆమె నాకు త‌న క‌ళ‌కు సంబంధించిన బహుమ‌తిని ఇచ్చారు. ఆమెకు నా కృత‌జ్ఙ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను అని ప్ర‌ధాని విన‌మ్ర‌త‌ను ట్వీట్ ద్వారా తెలిపారు.

ప్రజల పద్మ పురస్కారాల కోసం ప్రేరణమూర్తుల ను నామనిర్దేశం చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్ర‌ధాన మంత్రి

July 11th, 11:40 am

క్షేత్ర స్థాయి లో ప్రశంసాయోగ్యమైన కృషి ని చేస్తున్నటువంటి, ప్రజల కు అంతగా తెలియనటువంటి వారి ని ప్రజా పద్మ పురస్కారాల కోసం నామనిర్దేశం చేయవలసిందంటూ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నామినేశన్ లను సెప్టెంబర్ 15 వరకు సమర్పించవచ్చు.