భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం

December 16th, 03:26 pm

శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.

శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన

December 16th, 01:00 pm

అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.

‘‘మూడు కొత్త నేర విచారణ చట్టాలు’’ విజయవంతంగా అమలు.. దేశానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 03rd, 12:15 pm

చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.

కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి

December 03rd, 11:47 am

పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్‌ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.

గయానాలో భారత సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి: ప్రధాన మంత్రి

November 22nd, 03:06 am

భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద విశేష కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు.

గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు

November 21st, 04:23 am

జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Joint Statement: 2nd India-Australia Annual Summit

November 19th, 11:22 pm

PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.

సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 10:45 am

గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!

సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 28th, 10:30 am

గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.

జర్మనీ చాన్సలర్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

October 25th, 01:50 pm

మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.

జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 01st, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్‌, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

బ్రూనై సుల్తానుతో విందు సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠానికి ఆంగ్లానువాదం

September 04th, 12:32 pm

సాదరంగా స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన గౌరవనీయులైన రాజుగారికీ, రాజ కుటుంబానికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక్కడ నాకు లభించిన ఆప్యాయత, మీరు చూపిన ఆదరణ మన దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి అనుబంధాన్ని నాకు గుర్తు చేసింది.

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

The world needs confluence, not influence, a message best delivered by India: PM Modi in Moscow

July 09th, 11:35 am

PM Modi addressed the Indian community in Moscow, Russia, stating that the development achieved by India in the past decade is just a trailer, with the next decade poised for even faster growth. He underscored the robust India-Russia relations.

రష్యాలో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 09th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున రష్యాలోని మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ సముదాయానికి చెందిన వారితో మాటామంతీ జరిపారు. ప్రవాసి భారతీయులు ప్రధాన మంత్రికి స్నేహభరితంగాను, ఉత్సాహపూర్వకంగాను స్వాగతం పలికారు.

The BAPS Hindu Temple in Abu Dhabi, UAE is a golden moment in the ties between India & UAE: PM Modi

February 14th, 07:16 pm

Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.

PM Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE

February 14th, 06:51 pm

Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.

Today world needs govts that are inclusive, move ahead taking everyone along: PM Modi

February 14th, 02:30 pm

At the invitation of His Highness Sheikh Mohamed bin Rashid Al Maktoum, Vice President, Prime Minister, Defence Minister, and the Ruler of Dubai, Prime Minister Narendra Modi participated in the World Governments Summit in Dubai as Guest of Honour, on 14 February 2024. In his address, the Prime Minister shared his thoughts on the changing nature of governance. He highlighted India’s transformative reforms based on the mantra of Minimum Government, Maximum Governance”.

వరల్డ్గవర్నమెంట్స్ సమిట్ 2024 లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

February 14th, 02:09 pm

దుబయి పాలకుడు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) యొక్క ఉపాధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రి అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 14వ తేదీ నాడు దుబయి లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ లో గౌరవ అతిథి గా పాల్గొన్నారు. ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం ‘‘భావి ప్రభుత్వాల కు రూపురేఖల ను కల్పించడం’’ పై ఆయన విశిష్ట కీలకోపన్యాన్ని ఇచ్చారు. 2018 సంవత్సరం లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ లో కూడా ప్రధాన మంత్రి గౌరవ అతిథి గా ఉన్నారు. ఈ సారి జరిగిన శిఖర సమ్మేళనం లో పది మంది అధ్యక్షులు మరియు పది మంది ప్రధాన మంత్రులు సహా ఇరవై మంది ప్రపంచ నేత లు పాలుపంచుకొన్నారు. ఈ ప్రపంచ సభ లో నూట ఇరవై కి పైగా దేశాల కు చెందిన ప్రభుత్వాల కు మరియు ప్రతినిధుల కు ప్రాతినిధ్యం ఉండింది.