ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 18th, 11:17 pm
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 18th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘మన్ కీ బాత్’ అద్భుతమైన మాధ్యమంగా మారింది: ప్రధాని మోదీ
February 26th, 11:00 am
మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.వర్చువల్ మాధ్యం ద్వారా భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య యుపిఐ-పేనౌలింకేజీని ప్రారంభించే కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీమరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్
February 21st, 11:00 am
భారతదేశాని కి చెందిన యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) కి మరియు సింగపూర్ కు చెందిన పేనౌ కు మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజి ని వర్చువల్ మాధ్యం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ లు పాల్గొన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు శ్రీ శక్తికాంత్ దాస్ తో పాటు మానిటరి ఆథారిటి ఆఫ్ సింగపూర్ యొక్క మేనేజింగ్ డైరెక్టరు శ్రీ రవి మేనన్ వారి వారి మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తూ ఒకరితో మరొకరు లైవ్ క్రాస్ బార్డర్ లావాదేవీ ని పూర్తి చేశారు.భారత్, సింగపూర్ మధ్య ఫిబ్రవరి 21న రెండు దేశాల రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్స్ లింకేజీ ప్రారంభం : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు
February 20th, 12:52 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి శ్రీ లీ సియెన్ లూంగ్ 2023 ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు భారత దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) , సింగపూర్ కు చెందిన పే నౌ మధ్య సీమాంతర అనుసంధానం ప్రారంభాన్ని వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా వీక్షిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఎఎస్) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవి మీనన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.