వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం
January 17th, 08:31 pm
130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.భారత - అమెరికా నేతల సంయుక్త ప్రకటన: ప్రపంచం మంచి కోసం భాగస్వామ్యం (సెప్టెంబర్ 24,2021)
September 24th, 09:50 pm
అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈరోజు వైట్ హౌస్‌కు తొలి ముఖాముఖి చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ మధ్యగల సన్నిహిత పరస్పర సంబంధాన్ని పునఃకొనసాగిస్తూ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు నూతన చర్యలను చర్చించారు.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షునితో ప్రధాని సమావేశం
September 24th, 09:46 pm
వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్పాదక చర్చలు జరిపారు. తన వ్యాఖ్యలలో, ఈరోజు ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ముఖ్యం. ఈ శతాబ్దం మూడవ దశాబ్దం ప్రారంభంలో మేము కలుస్తున్నాము. భారతదేశం మరియు యుఎస్ఎల మధ్య మరింత బలమైన స్నేహం కోసం బీజాలు పడ్డాయి అని అన్నారు.జి7 సమిట్ లో భాగం గా రెండో రోజు న రెండు సమావేశాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
June 13th, 08:06 pm
జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో రెండో రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు సమావేశాల లో పాల్గొన్నారు. ఆ రెండు సమావేశాలు ‘బిల్డింగ్ బ్యాక్ టుగెదర్-ఓపెన్ సొసైటీస్ ఎండ్ ఇకానమిస్’, (సంయుక్త పునర్ నిర్మాణం- బహిరంగ సమాజం మరియు ఆర్థిక వ్యవస్థ లు) ‘బిల్డింగ్ బ్యాక్ గ్రీనర్: క్లైమేట్ ఎండ్ నేచర్’ (సంయుక్త హరిత పునర్ నిర్మాణం- జలవాయు పరివర్తన మరియు ప్రకృతి) అనే పేరుల తో సాగాయి.భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం
May 04th, 06:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.