పారాలింపిక్ గేమ్స్ లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంసలు

September 08th, 10:29 pm

పారాలింపిక్ గేమ్స్ లో భారతదేశం కనబరచిన అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పారిస్ లో జరిగిన ‘పారాలింపిక్ గేమ్స్ 2024’లో 29 పతకాలను చేజిక్కించుకుని, దేశ దివ్యాంగ క్రీడాకారులు ప్రదర్శించిన అంకిత భావాన్నీ, తిరుగులేని స్ఫూర్తినీ ప్రధాన మంత్రి ప్రశంసించారు.

హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 06th, 05:22 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కాంస్య పతకాన్ని గెలిచిన జూడో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 05th, 10:26 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల 60 కిలో గ్రాముల జె1 పోటీలో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కంచు పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అభినందనలను తెలియజేశారు.

తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

September 05th, 11:00 am

గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.

పారిస్ పారాలింపిక్స్ 2024: ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 02nd, 10:50 am

ట్రాక్ అండ్ పీల్డ్ ఈవెంట్స్ లో క్రీడాకారిణి ప్రీతి పాల్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో రెండో పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజున అభినందనలు తెలిపారు.

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

September 02nd, 10:50 am

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

పారిస్ పారాలింపిక్స్ లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన రుబీనా ఫ్రాన్సిస్ కు ప్రధాన మంత్రి అభినందనలు

August 31st, 08:19 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని రుబీనా ఫ్రాన్సిస్ గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.

షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం

August 30th, 08:55 pm

పారిస్ పారాలింపిక్స్ లో పి1 - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 06:42 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో 100 మీటర్ల టి35 పోటీ లో భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనలను తెలియజేశారు.

పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 04:57 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలిచిన అవని లేఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 04:49 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ అవని లేఖరా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘పారిస్ పారాలింపిక్స్ 2024’ లో మన దేశ క్రీడాకారుల బృందం రాణించాలన్నదే 140 కోట్ల మంది భారతీయుల కోరిక: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 28th, 09:47 pm

‘పారిస్ పారాలింపిక్స్ 2024’లో పాల్గొననున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల బృందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని వారి ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ వారు విజయం సాధించాలని భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

పారిస్ పారాలింపిక్ గేమ్స్ కోసం భారత బృందంతో ప్రధాని మోదీ సంభాషించారు

August 19th, 06:30 pm

పారిస్ పారాలింపిక్ క్రీడల కోసం భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంతోషకరమైన సంభాషించారు. శీతల్ దేవి, అవని లేఖా, సునీల్ అంటిల్, మరియప్పన్ తంగవేలు మరియు అరుణ తన్వర్ వంటి అథ్లెట్లతో ప్రధాని వ్యక్తిగతంగా మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులందరూ విజేతలే: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 15th, 05:03 pm

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలో వారితో కాసేపు ముచ్చటించారు. క్రీడా పోటీల్లో వారి అనుభవాలు, అనుభూతుల గురించి వాకబు చేశారు. మైదానంలో వారు శక్తివంచన లేకుండా శ్రమించారని, అసాధారణ ప్రతిభానైపుణ్యాలు ప్రదర్శించారని ప్రశంసించారు.

కాంస్య పతకాన్ని సాధించినందుకు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లకు ప్రధాన మంత్రి అభినందనలు

July 30th, 01:38 pm

‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ పోటీ లో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ నుప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది

July 13th, 11:56 pm

ఫ్రాన్స్ లో అత్యున్నత పురస్కారం ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఈ రోజు న ప్రదానం చేశారు.

ఫ్రాన్స్అధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం తాలూకు పత్రికా ప్రకటన

May 04th, 10:43 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో రెండో ఇండియా-నార్డిక్ సమిట్ ముగించి తిరుగుప్రయాణం లో 2022వ సంవత్సరం మే 4వ తేదీ న ఫ్రాన్స్ కు ఆధికారిక యాత్ర ను జరిపారు.

బెర్లిన్.. కోపెన్‌హాగన్.. పారిస్ పర్యటనకు బయల్దేరేముందు ప్రధానమంత్రి వీడ్కోలు ప్రకటన

May 01st, 11:34 am

జర్మనీ సమాఖ్య చాన్సలర్‌ గౌరవనీయ ఓలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు 2022 మే 2వ తేదీన నేను బెర్లిన్‌ వెళ్తున్నాను. అలాగే డెన్మార్క్‌ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్‌సన్‌ ఆహ్వానం అందుకున్న నేపథ్యంలో 2022 మే 3-4 తేదీల్లో కోపెన్‌హాగెన్‌ వెళ్లి, ద్వైపాక్షిక చర్చలతోపాటు అక్కడ నిర్వహించే భారత-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను. అటుపైన భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కొద్దిసేపు ఆగి, ఆ దేశాధ్యక్షుడు మాననీయ ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో సమావేశమవుతాను.

సెప్టెంబర్ 25 న ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

September 24th, 05:31 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 25 న సాయంత్రం పూట జరిగే ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.