గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.ఇండియా గేట్వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం
January 23rd, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్వద్ద నేతాజీ సుభాస్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకుగాను ‘సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించివుంటే ప్రగతిశీల మార్పులతో ముందడుగు వేస్తున్న భారతదేశాన్ని చూసి గర్వించేవారు : ప్రధానమంత్రి
January 23rd, 11:01 pm
భారతీయులకు లక్ష్యం, బలం వుండాలని వాటినుంచి స్ఫూర్తిని పొంది మన దేశాన్ని మనమే ధైర్యసాహసాలతో పరిపాలించుకోవాలంటూ శ్రీ నేతాజీ సుభాష్ చేసిన ప్రకటనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఆయన చెప్పిన ప్రకారమే ప్రస్తుతం కొనసాగుతున్న ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భారతీయులకు ఆ లక్ష్యాలు, బలం వున్నాయని ప్రధాని అన్నారు. మనలో వున్న స్వీయ బలం, పట్టుదలతో ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం పెట్టుకున్న లక్ష్యాలను అందుకుకోవచ్చని ప్రధాని అన్నారు. శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటనల్ని పేర్కొంటూ మాట్లాడిన ప్రధాని భారతీయులు స్వేదాన్ని చిందించి దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. కష్టపడే తత్వంతో, నూతన ఆవిష్కరణలతో భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దాలని ప్రధాని ఆకాంక్షించారు. కొలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.హరిపుర లో రేపటి కార్యక్రమం మన దేశానికి నేతాజీ బోస్ అందించిన తోడ్పాటుకు ఒక ప్రశంస అవుతుంది: ప్రధాన మంత్రి
January 22nd, 07:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గారికి రేపు నేతాజీ జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి సమర్పించారు. ‘‘రేపటి రోజున మహనీయుడు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గారి జయంతి కి గుర్తుగా #ParakramDivas భారతదేశం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వివిధ కార్యక్రమాల లో భాగం గా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గుజరాత్ లోని హరిపుర లో నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఆరంభమయ్యే ఆ కార్యక్రమం లో భాగస్తులు కండి.