కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ

July 26th, 09:30 am

లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు

July 26th, 09:20 am

కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

Rozgar Melas plays a crucial role in enhancing the contribution of our Yuva Shakti in nation building: PM Modi

February 12th, 11:00 am

PM Modi distributed more than 1 lakh appointment letters to newly inducted recruits via video conferencing. “Today, every youth believes that they can cement their job position with hard work and skills”, PM Modi said, highlighting that the government strives to make the youth a partner in the development of the nation. He informed that the present government in the last 10 years has handed out jobs to the youth 1.5 times more than the previous governments.

ఉపాధి సమ్మేళనం కింద ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేసిన ప్రధానమంత్రి

February 12th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వివిధ విభాగాలు.. సంస్థలలో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేశారు. అలాగే న్యూఢిల్లీలోని ‘‘కర్మయోగి భవన్’’ సమీకృత ప్రాంగణం తొలిదశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిషన్ కర్మయోగి సంబంధిత వివిధ మూలస్తంభాల మధ్య సహకారం, సమన్వయానికి ఈ ప్రాంగణం తోడ్పడుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- నియామక లేఖలు అందుకున్న యువతరానికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో యువతరానికి ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నదని ఆయన ఉద్ఘాటించారు.

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ వాహనశ్రేణిపై దాడిని ఖండించిన ప్రధానమంత్రి

November 13th, 07:15 pm

మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై బాంబు దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు ఇవాళ అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు.