హర్యానాలోని పానిపట్‌లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
December 09th, 05:54 pm
హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు, ఈ భూమి పుత్రుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ కృష్ణ పాల్ గారు, హర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారు, ఆర్తి గారు, ఎంపీలు, ఎమ్ఎల్ఏలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులు, సోదరీమణులారా.ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 09th, 04:30 pm
మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో ప్రధానమంత్రి పర్యటన
December 08th, 09:46 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో పర్యటించనున్నారు. జైపూర్ కు ఆయన ఉదయం సుమారు పదిన్నర గంటలకు జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేఈసీసీ)లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రధాని పానిపట్ కు వెళ్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు, ఆయన ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రారంభిస్తారు. దీంతో పాటు మహారాణా ప్రతాప్ ఉద్యాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రధాన కేంపస్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేస్తారు.