తమిళ నూతన సంవత్సర వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం

April 13th, 08:21 pm

మీ అందరికీ తమిళ పుత్తండు శుభాకాంక్షలు! నా తమిళ సోదరసోదరీమణుల ప్రేమానురాగాల కారణంగానే ఈ రోజు మీతో తమిళ పుత్తండు జరుపుకునే అవకాశం నాకు లభించింది. ప్రాచీన కాలంలో పుతాండు అనేది కొత్తదనం యొక్క పండుగ! ఇంత ప్రాచీన తమిళ సంస్కృతి, ప్రతి సంవత్సరం పుత్తండు నుంచి కొత్త శక్తితో ముందుకు సాగే ఈ సంప్రదాయం నిజంగా అద్భుతం! ఇదే తమిళనాడుకు, తమిళ ప్రజలకు ఎంతో ప్రత్యేకం. అందువలన, ఈ సంప్రదాయం పట్ల నాకు ఎల్లప్పుడూ ఆకర్షణతో పాటు దానితో భావోద్వేగ అనుబంధం ఉంది. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మణినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమిళ సంతతికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వారే నా ఓటర్లు, నన్ను ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిని చేస్తారు. వారితో గడిపిన క్షణాలను నేనెప్పుడూ ఆస్వాదిస్తాను. తమిళనాడుపై నాకున్న ప్రేమను తమిళనాడు ప్రజలు పెద్ద ఎత్తున పంచుకోవడం నా అదృష్టం.

తమిళ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ప్రధాని

April 13th, 08:20 pm

తమిళనాడు వాసి, కేంద్రమంత్రివర్గ సహచరుడైన శ్రీ ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన తమిళ సంవత్సరాది వేడుకలలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.