పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 25th, 04:31 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నా చిరకాల మిత్రుడు, మహామన సంపూర్ణ వంగమే చీఫ్ ఎడిటర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ గారు, ప్రభు నారాయణ్ శ్రీవాస్తవ గారు, వేదికపై ఉన్న విశిష్ట వ్యక్తులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకుని, సేకరించిన ఆయన రచనలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి

December 25th, 04:30 pm

మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా, ఈరోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య' 11 సంపుటాల మొదటి సిరీస్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు. శ్రీ మోదీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రముఖ వ్యవస్థాపకుడు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి అపారంగా కృషి చేసిన విశిష్ట పండితులు, స్వాతంత్య్ర సమరయోధుడు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

డిసెంబరు 25న ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ రచనల మహా సంకలనం ఆవిష్కరించనున్న ప్రధాని

December 24th, 07:47 pm

మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబర్, 25న సాయంత్రం 4:30 గంటలకు ‘కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ పేరిట 11 సంచికలతో కూడిన మాలవీయ రచనల మహా సంకలనం తొలి శ్రేణిని ఆవిష్కరిస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. జాతికి అనుపమాన సేవలందించిన స్వాతంత్ర్య సమర యోధులను అమృత కాలంలో సముచిత గుర్తింపుతో గౌరవించాలన్నది ప్రధానమంత్రి దృక్కోణం. ఈ దిశగా ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల మహా సంకలనం’ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భం లో ఆయన కుశ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

December 25th, 07:55 pm

పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాలవీయ గారి జ‌యంతి సంద‌ర్భం లో ఈ రోజు పార్ల‌మెంట్‌ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.