కర్నాటకలోని హుబ్బల్లిలో 26వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 12th, 04:30 pm

కర్ణాటకలోని ఈ ప్రాంతం సాంప్రదాయం, సంస్కృతి మరియు విజ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎందరో ప్రముఖులను జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించారు. ఈ ప్రాంతం దేశానికి ఎందరో గొప్ప సంగీతకారులను అందించింది. పండిట్ కుమార్ గంధర్వ, పండిట్ బసవరాజ్ రాజ్‌గురు, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, భారతరత్న పండిట్ భీంసేన్ జోషి మరియు పండిత గంగూబాయి హంగల్ జీ లకు ఈరోజు హుబ్బళ్లి నేల నుండి నివాళులు అర్పిస్తున్నాను.

కర్ణాటకలోనిహుబ్బళ్లిలో 26వ జాతీయయువజనోత్సవాలకు ప్రధానమంత్రిశ్రీకారం

January 12th, 04:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లిలో ఇవాళ 26వ జాతీయ యువ‌జన ఉత్స‌వాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆశయాలు, ప్రబోధాలు, సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈసారి “వికసిత యువతరం - వికసిత భారతం” ఇతివృత్తంగా వేడుకలను నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ వేడుకలు అందరిలోనూ ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని నింపుతాయి.

పండిట్ భీమ్ సేన్ జోషి శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 04th, 07:57 pm

పండిట్ భీమ్ సేన్ జోషి శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భ‌గా ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ,

పండిత్ భీమ్‌సేన్ జోషీ జ‌యంతి సంద‌ర్భం లో ఆయ‌న‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

February 04th, 05:14 pm

పండిత్ భీమ్‌సేన్ జోశీ గారికి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.