వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం

July 14th, 06:28 pm

వారణాసిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, వారణాసిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు పని పూర్తిగా మొదలైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితో పాటు పది ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

వార‌ణాసిలో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌,ప్రారంభోత్స‌వాలు చేసిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

July 14th, 06:07 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు (జూలై 14,2018) వార‌ణాసిలో సుమారు 900 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌లు ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌,ప్రారంభోత్స‌వాలు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించిన ప్రాజెక్టుల‌లో వార‌ణాసి సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టు, వార‌ణాసి- బాలియా మెమూ రైలు ప్రాజెక్టు ఉన్నాయి.శంకుస్థాప‌న చేసిన వాటిలో పంచ‌కోషి ప‌రిక్ర‌మ మార్గ్ , స్మార్ట్‌సిటీ మిష‌న్‌, న‌మామి గంగే ప‌థ‌కం కింద చేప‌ట్టిన ప‌లు ఇత‌ర ప్రాజెక్టులు ఉన్నాయి. వార‌ణాసిలో అంత‌ర్జాతీయ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు కూడా ప్ర‌ధాన‌మంత్ర శంకుస్థాప‌న చేశారు.