ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 31st, 10:39 pm
ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 31st, 10:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.మహారాష్ట్ర లోని పాల్ఘర్ లో వధావన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 30th, 01:41 pm
మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వధావన్ నౌకాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 30th, 01:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 76,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు రూ. 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 360 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రాజెక్టు అయిన నౌకా సమాచార సహాయ వ్యవస్థకు శ్రీ మోదీ శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులైన మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను మోదీ అందజేశారు.ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి
August 29th, 04:47 pm
మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.'మహారాష్ట్రలోని వధవన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్‌డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ అభివృద్ధికి' క్యాబినెట్ ఆమోదం
June 19th, 09:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(19 జూన్) మహారాష్ట్రలోని దహను సమీపంలో వధవన్‌లో మేజర్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పిఏ), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (ఎంఎంబి) ద్వారా ఏర్పడిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి) వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (విపిపిఎల్) ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను వరుసగా 74 శాతం, 26 శాతం వాటాతో నిర్మిస్తారు. వధవన్ ఓడరేవు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వధావన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌గా అభివృద్ధి చేస్తారు.PM expresses sadness on demise of MP from Palghar, Shri Chintaman Wanaga
January 30th, 03:57 pm
PM expressed sadness on demise of MP from Palghar, Shri Chintaman Wanaga. He said, Pained by the unfortunate demise of my colleague and MP from Palghar, Shri Chintaman Wanaga. He played an important role in building the BJP in the Thane region and did commendable work for the welfare of tribals. My thoughts are with his family and supporters in this sad hour.