మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.

ఇండియా , ఆస్ట్రేలియా రెండ‌వ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ స్కాట్ మారిస‌న్‌.

March 21st, 06:08 pm

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి స్కాట్ మారిస‌న్ ఇండియా - ఆస్ట్రేలియా వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు ఇరుదేశాల మ‌ధ్య బ‌హుముఖ సంబంధాలను స‌మీక్షించ‌డంతో పాటు ప్రాంతీయ , అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పై వారు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

యువచిత్రకారుడి ని ఆయన చిత్రలేఖనాల కు మరియు ప్రజారోగ్యం పట్ల ఆయన లో ఉన్న శ్రద్ధ కుగాను ప్రశంసించిన ప్రధాన మంత్రి

August 26th, 06:02 pm

బెంగళూరు కు చెందిన ఒక విద్యార్థి శ్రీ స్టీవెన్ హ్యారిస్ ను ఆయన చిత్రించిన చిత్రలేఖనాలకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ తనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. 20 యేళ్ల వయస్సు వున్న ఆ చిత్రకారుడు ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాస్తూ, ప్రధాన మంత్రి తాలూకు సుందర వర్ణచిత్రాలు రెండిటిని ఆ లేఖ తో పాటు పంపారు. దీనికి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ఆ యువకుడి ని పొగడి, ఉత్సాహపరచారు.