పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణులు డా. కేఎస్ మణిలాల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
January 01st, 10:29 pm
‘‘పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్ష శాస్త్ర నిపుణులు డాక్టర్ కేఎస్ మణిలాల్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వృక్షశాస్త్రంలో ఆయన చేసిన కృషి భవిష్యత్తులో వృక్షశాస్త్ర నిపుణులకు, పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తుంది. కేరళ చరిత్ర, సంస్కృతిపై సైతం ఆయన ఆసక్తి చూపించేవారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికీ, స్నేహితులకూ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.