సభాపతి ఎన్నిక అనంతరం 18వ లోక్ సభలో ప్రధాని ప్రసంగం పాఠం

June 26th, 11:30 am

మీరు రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికవడం సభ అదృష్టం. మీతో పాటు సభ మొత్తానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

స్పీకర్ ఎన్నికైన తరువాత లోక్ సభ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

June 26th, 11:26 am

వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

The P20 Summit is a ‘Maha Kumbh’ of all Parliamentary practices from across the globe: PM Modi

October 13th, 11:22 am

PM Modi inaugurated the 9th G20 Parliamentary Speakers' Summit (P20) at Yashobhoomi, New Delhi. The Summit is a ‘Maha Kumbh’ of all Parliamentary practices from across the globe”, PM Modi remarked.

జి-20 సభాపతుల 9వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని శ్రీకారం

October 13th, 11:06 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ ప్రాంగణంలో జి-20 సభాపతుల 9వ శిఖరాగ్ర సదస్సు (పి20)ను ప్రారంభించారు. “ఒకే భూమి-ఒకే కుటుంబం- ఒకే భవిష్యత్తు కోసం చట్టసభలు” ఇతివృత్తంగా భారత జి-20 అధ్యక్షత పరిధిలోని విస్తృత చట్రం కింద ఈ సదస్సును భారత పార్లమెంటు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని ప్రసంగిస్తూ- ముందుగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున జి-20 చట్టసభాపతులను శిఖరాగ్ర సదస్సుకు స్వాగతించారు. “ప్రపంచవ్యాప్తంగాగల అన్ని పార్లమెంటరీ విధానాలకు ఈ శిఖరాగ్ర సదస్సు ‘మహా కుంభమేళా’ అని ఆయన అభివర్ణించారు. దీనికి హాజరైన ప్రతినిధులంతా వివిధ దేశాల పార్లమెంటరీ చట్రంపై అనుభవజ్ఞులని శ్రీ మోదీ కొనియాడుతూ, నేటి కార్యక్రమంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.