మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 04th, 09:45 am

ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!

మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి

January 04th, 09:44 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.

పిఎమ్ కేర్స్ లో భాగం గా ఏర్పాటు చేసినపిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను అక్టోబరు 7న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి

October 06th, 02:54 pm

పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 7న ఉదయం 11 గంటల కు ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎమ్ఎస్ రుషీకేశ్ లో జరుగనున్న ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో, దేశం లోని అన్ని జిల్లాలు ఇక పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులను కలిగివున్నట్లు అవుతుంది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

August 15th, 03:02 pm

నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.

75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 15th, 07:38 am

స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.

75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం

August 15th, 07:37 am

దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.

కోవిడ్ -19 పరిస్థితిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠం

July 16th, 12:07 pm

కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తోన్న పోరాటంలో అనేక ముఖ్యమైన సమస్యలపై మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈశాన్య ప్రాంతంలోని గౌరవనీయ ముఖ్యమంత్రులందరితో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం నాకు లభించింది. పరిస్థితి ఆందోళన కలిగించే రాష్ట్రాలతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.

కోవిడ్ స్థితి పై చ‌ర్చించ‌డం కోసం 6 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

July 16th, 12:06 pm

కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చ‌ర్చించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఒడిశా, మ‌హారాష్ట్ర, కేర‌ళ ల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవ‌డం లో సాధ్య‌మైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్ర‌ధాన మంత్రి కి ముఖ్య‌మంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైర‌స్ వ్యాప్తి ని క‌ట్ట‌డి చేయడం కోసం తీసుకొంటున్న‌ చ‌ర్య‌ల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్య‌క్ర‌మం లో పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి దృష్టి కి ముఖ్య‌మంత్రులు తీసుకు వ‌చ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పంద‌న ను కూడా వారు తెలియ‌ జేశారు.

కోవిడ్-19 పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం

July 13th, 03:53 pm

మీ అందరికీ నమస్కారం! మొదటగా, కొన్ని కొత్త బాధ్యతలు తీసుకున్న వ్యక్తులను పరిచయం చేస్తాను, ఇది మీకు కూడా మంచిది. శ్రీ మన్ సుఖ్ భాయ్ మాండవియా, ఇప్పుడే మా కొత్త ఆరోగ్య మంత్రి అయ్యారు, డాక్టర్ భారతి పవార్ గారు కూడా ఆయనతో ఎంఓఎస్ గా కూర్చున్నారు. ఆమె మా ఆరోగ్య శాఖలో ఎంఓఎస్ గా పనిచేస్తోంది. మీతో నిమగ్నం కావడం రెగ్యులర్ గా ఉండబోయే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు; వారు డోనర్ మంత్రిత్వ శాఖ కొత్త మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు ఎం.ఒ.ఎస్. ఆయనతో శ్రీ బి.ఎల్. వర్మ గారు కూర్చున్నారు.ఈ పరిచయం మీకు కూడా అవసరమే కదా.

కోవిడ్‌-19 స్థితి పై ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

July 13th, 01:02 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోవిడ్-19 స్థితి ని గురించి ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం లో నాగాలాండ్‌, త్రిపుర‌, సిక్కిమ్, మేఘాల‌య‌, మిజోర‌మ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపుర్ ముఖ్య‌మంత్రుల‌ తో పాటు అస‌మ్ ముఖ్య‌మంత్రి కూడా పాల్గొన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి ని సంబాళించ‌డం లో స‌కాలం లో చ‌ర్య‌లు తీసుకొన్నందుకు గాను ప్ర‌ధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించినందుకు గాను ఆయ‌న ను వారు ప్ర‌శంసించారు. ముఖ్య‌మంత్రుల‌ కు తోడు హోం శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ, ఆరోగ్య శాఖ‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) శాఖ మంత్రుల‌ తో పాటు ఇత‌ర మంత్రులు కూడా ఈ స‌మావేశం లో పాలుపంచుకొన్నారు.

దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా ను పెంచడం అనే అంశం పై సమీక్షను నిర్వహించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

July 09th, 01:10 pm

దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.

కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 09:45 am

కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.

కోవిడ్‌-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి

June 18th, 09:43 am

దేశవ్యాప్తంగాగల కోవిడ్‌-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

సిఎస్ఐఆర్ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 04th, 10:28 am

ఏ దేశంలోనైనా సైన్స్ అండ్ టెక్నాలజీ తన పరిశ్రమ, మార్కెట్, సమన్వయం, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అంతర్గత వ్యవస్థతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నంతవరకు అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో, సైన్స్, సమాజం మరియు పరిశ్రమల యొక్క ఒకే వ్యవస్థను నిర్వహించడానికి CSIR ఒక సంస్థాగత వ్యవస్థగా పనిచేస్తోంది. మా సంస్థ దేశానికి చాలా ప్రతిభను ఇచ్చింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఈ సంస్థకు శాంతిస్వరూప్ భట్నాగర్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా, మరియు ఈ కారణంగా, ఒక సంస్థ యొక్క వారసత్వం చాలా గొప్పగా ఉన్నప్పుడు, భవిష్యత్తుపై వారి బాధ్యత కూడా అంతే పెరుగుతుందని నేను నొక్కిచెప్పాను. ఈ రోజు కూడా, నేను, దేశం, మానవాళికి కూడా మీ నుండి అధిక అంచనాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల నుండి, సాంకేతిక నిపుణుల నుండి చాలా అంచనాలు ఉన్నాయి.

సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్ర‌ధాన మంత్రి

June 04th, 10:27 am

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు.

గత 7 ఏళ్ల లో, మనమంతా 'టీమ్ ఇండియా'గా పనిచేశాము: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

May 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.

కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 18th, 11:40 am

Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.

కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం

May 18th, 11:39 am

కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.

దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

May 15th, 02:42 pm

దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.

పిఎం-కిసాన్ కింద 8వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 14th, 11:04 am

Prime Minister Shri Narendra Modi released 8th instalment of financial benefit of Rs 2,06,67,75,66,000 to 9,50,67,601 beneficiary farmers under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme today via video conferencing. Prime Minister also interacted with farmer beneficiaries during the event. Union Agriculture Minister was also present on the occasion.