డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో ప్రధానమంత్రి పర్యటన

December 08th, 09:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో పర్యటించనున్నారు. జైపూర్ కు ఆయన ఉదయం సుమారు పదిన్నర గంటలకు జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేఈసీసీ)లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రధాని పానిపట్ కు వెళ్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు, ఆయన ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రారంభిస్తారు. దీంతో పాటు మహారాణా ప్రతాప్ ఉద్యాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రధాన కేంపస్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేస్తారు.

PM Modi says Government is committed to empowering farmers of the nation

August 11th, 04:50 pm

The Prime Minister, Shri Narendra Modi has remarked that the Government is committed to empowering the farmers of the nation as he released 109 new crop varieties in Delhi today. He further added that the climate-friendly and high-yielding varieties of crops would boost the income of farmers.

అధిక దిగుబడితోపాటు వాతావరణ ప్రతిరోధక.. జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి

August 11th, 02:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో 109 రకాల అధిక దిగుబడినిచ్చే, వాతావరణ ప్రతిరోధక, జీవ-బలోపేత వంగడాలను ఆవిష్కరించారు.

పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 01st, 12:31 pm

ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్‌ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘పీఎం-కిసాన్‌ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి

January 01st, 12:30 pm

దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్‌) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.

పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 09th, 12:31 pm

గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్‌ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,

పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి

August 09th, 12:30 pm

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO

October 14th, 11:59 am

On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.