అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 28th, 11:30 am

మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.

ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి విశేష స్పందనపై ప్రధాని ప్రశంస

October 16th, 09:22 pm

ఆయుష్మాన్‌ భవ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కింద 80,000 మందికిపైగా ప్రజలు అవయవ దానానికి ప్రతినబూనడం ఈ కార్యక్రమ విజయానికి తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు.

'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ

March 26th, 11:00 am

నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.