ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 23rd, 08:54 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి
May 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
April 20th, 10:45 am
కార్యక్రమంలో నాతో పాటు ఉన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ కిరణ్ రిజిజు జీ, జి. కిషన్ రెడ్డి జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, మీనాక్షి లేఖి జీ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్, భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయులైన సన్యాసులు, ఇతర ప్రముఖులు , లేడీస్ అండ్ జెంటిల్మెన్!న్యూ ఢిల్లీ లో జరిగిన గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక సదస్సు లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 20th, 10:30 am
ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.తుర్కియా, సిరియా దేశాలలో పనిచేసి వచ్చిన ఎన్ డీఆర్ ఎఫ్ దళాలనుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 20th, 06:20 pm
మానవత కోసం మహోన్నత కార్యం పూర్తి చేసుకొని మీరంతా తిరిగి వచ్చారు. ఎన్డీ ఆర్ ఎఫ్ కావచ్చు, సైన్యం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, ఇతర సేవా బృందాలు కావచ్చు.. ‘ఆపరేషన్ దోస్త్’ లో పాలుపంచుకున్న మీ మొత్తం బృందం చాలా గొప్ప పని చేసింది. మన నోరు లేని మూగ జీవాలైన శునక బృందం కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచింది. దేశం మీ అందరినీ చూసి గరవిస్తోంది.తుర్కియే.. సిరియాలలో ‘ఆపరేషన్ దోస్త్’లోపాల్గొంటున్నఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ప్రధానిసంభాషణ
February 20th, 06:00 pm
తుర్కియే, సిరియాలలో భూకంప బాధితుల రక్షణ-సహాయ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొంటున్న భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. రెండు దేశాల్లో భూకంప బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని వారితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వసుధైవ కుటుంబకం భావన గురించి ప్రధాని విశదీకరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ స్ఫూర్తిని తుర్కియే, సిరియాల్లో భారత బృందం సేవలు ప్రతిబింబించాయని ఆయన వివరించారు.తుర్కియేప్రజల వెన్నంటి భారతదేశం దృఢం గా నిలబడుతుంది: ప్రధాన మంత్రి
February 10th, 08:11 pm
భారతదేశం ‘ఆపరేశన్ దోస్త్’ లో భాగం గా ఎక్కువ లో ఎక్కువ మంది యొక్క ప్రాణాల ను కాపాడే ప్రయాసల ను చేస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.