ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

March 04th, 12:45 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొదటి 6 దశల్లో జరిగిన ఎన్నికలలో యూపీ ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ఎలా ఓటు వేశారో, యూపీ నుంచి ‘పరివార్వాద్’, ‘మాఫియావాద్’లను తొలగించడం కొనసాగించే బాధ్యతను మిర్జాపూర్ ప్రజలకు ఎలా ఇచ్చారో వివరిస్తూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు.

గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ

August 28th, 08:48 pm

జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.

పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 28th, 08:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్‌ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.