కెనడాలోని సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు

May 02nd, 08:33 am

మీ అందరికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు గుజరాత్ దినోత్సవ శుభాకాంక్షలు! కెనడాలో భారతీయ సంస్కృతి మరియు భారతీయ విలువలను సజీవంగా ఉంచడంలో అంటారియోకు చెందిన సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ పోషించిన పాత్ర గురించి మనందరికీ తెలుసు. కెనడాలో నా పర్యటనల్లో మీ ఈ ప్రయత్నాల్లో మీరు ఎంత విజయం సాధించారో, మీ గురించి మీరు ఎలా సానుకూల అభిప్రాయాన్ని వెలిబుచ్చారో నేను అనుభవించాను. 2015 నాటి అనుభవాన్ని, కెనడాలోని భారత సంతతికి చెందిన ప్రజల అభిమానాన్ని, ప్రేమను మనం ఎప్పటికీ మరచిపోలేం. సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్‌ని మరియు ఈ వినూత్న ప్రయత్నానికి సహకరించిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. సనాతన్ దేవాలయం వద్ద ఉన్న ఈ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.

కెనడాలోని అంటారియోలో ‘సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం ఈ కేంద్రం ప్రాంగణంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ నిర్వహించారు;

May 01st, 09:33 pm

కెనడాలోని అంటారియో రాష్ట్ర పరిధిలోగల మార్ఖం నగరంలో ‘సనాతన్‌ మందిర్‌ సాంస్కృతిక కేంద్రం’ (ఎస్‌ఎంసీసీ) ప్రాంగణంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా తొలుత స్వాతంత్ర్య అమృత్‌ మహోత్సవాలు, గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడాలో 2015నాటి పర్యటన సందర్భంగా సనాతన్‌ మందిర్‌ సాంస్కృతి కేంద్రం సానుకూల ప్రభావం తన అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆ సమయంలో భారతీయ సంతతి ప్రవాస ప్రజానీకం చూపిన ప్రేమానురాగాలు తన మనసును కదిలించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే “సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమేగాక రెండు దేశాలమధ్య స్నేహ సంబంధాలకు చిహ్నం కాగలదు” “సనాతన్ మందిర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగానూ రూపొందుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.