సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 11th, 02:00 pm
నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 01:30 pm
తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.A perfect example of ‘One Life, One Mission’, Acharya Goenka had only one mission–Vipassana: PM Modi
February 04th, 03:00 pm
PM Modi addressed the concluding ceremony of the year-long celebrations of S N Goenka’s 100th birth anniversary via video message. PM Modi spoke highly about Shri Goenka absorbing Vipassana deeply along with his calm and serious personality which created an atmosphere of virtuousness wherever he went. “A perfect example of ‘One Life, One Mission’, Shri Goenka had only one mission – Vipassana!, he added.ఆచార్య శ్రీ ఎస్.ఎన్.గోయంకా శతజయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 04th, 02:30 pm
విపాసన ధ్యాన బోధకులు ఆచార్య శ్రీ ఎస్.ఎన్. గోయంకా శతజయంతి వేడుకలు సంవత్సరం క్రితం ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకున్నదని చెబుతూ,ఇదే సమయంలో కల్యాణ్ మిత్ర గోయంకా ఆదర్శాలను వారు గుర్తుచేసుకున్నారు..ఈ ఉత్సవాలు ఈరోజు ముగింపు దశకు చేరుకుంటున్న సందర్బంలో దేశం శరవేగంతో వికసిత్ భారత్ తీర్మానాలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. గురూజీ తరచూ వాడే బుద్ధభగవానుడి మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,, దాని అర్ధాన్ని వివరించారు. కలసి ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఐక్యత, ఏకత్వ శక్తి వికసిత్ భారత్కు ప్రధాన పునాది అని ప్రధానమంత్రి అన్నారు. ఏడాదిపొడవునా ఈ మంత్రాన్ని ప్రచారం చేసినవారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.