The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

PM Modi addresses the Parliament of Guyana

November 21st, 07:50 pm

PM Modi addressed the National Assembly of Guyana, highlighting the historical ties and shared democratic ethos between the two nations. He thanked Guyana for its highest honor and emphasized India's 'Humanity First' approach, amplifying the Global South's voice and fostering global friendships.

India achieved its non-fossil installed electric capacity target nine years in advance: PM Modi

July 22nd, 10:00 am

PM Modi addressed the G20 Energy Ministers Meet in Goa. Throwing light on India’s efforts in green growth and energy transition, he pointed out that India was the most populated nation and the fastest-growing large economy in the world and yet was strongly moving towards its climate commitments. The PM informed that India achieved its non-fossil installed electric capacity target nine years in advance and set a higher target for itself.

జి 20 ఇంధన మంత్రుల సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 22nd, 09:48 am

ఇంధన మార్పు విషయంలో ప్రతి దేశానికి భిన్నమైన వాస్తవికత , మార్గం ఉన్నప్పటికీ, ప్రతి దేశం లక్ష్యాలు ఒకటేనని తాను గట్టిగా నమ్ముతున్నట్టు ప్రధాన మంత్రి చెప్పారు. హరిత వృద్ధి, ఇంధన మార్పు లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అయినప్పటికీ దాని వాతావరణ కట్టుబాట్ల వైపు బలంగా కదులుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం తన శిలాజేతర స్థాపిత విద్యుత్ సామర్థ్య లక్ష్యాన్ని తొమ్మిదేళ్ల ముందుగానే సాధించిందని, తనకంటూ ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. 2030 నాటికి శిలాజేతర స్థాపిత సామర్థ్యాన్ని 50 శాతం సాధించాలని దేశం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. సౌర, పవన విద్యుదుత్పత్తిలో భారతదేశం కూడా ప్రపంచ సారథ్య దేశాలలో ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. పావగడ సోలార్ పార్కు , మొధేరా సోలార్ విలేజ్ లను సందర్శించడం ద్వారా క్లీన్ ఎనర్జీ పట్ల భారతదేశ నిబద్ధతను , స్థాయిని వీక్షించే అవకాశం వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులకు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

జి20 పర్యటన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

June 21st, 03:00 pm

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ లోకి మీ అందరి ని నేను ఇదే ఆహ్వానిస్తున్నాను. ప్రపంచవ్యాప్తం గా రెండు ట్రిలియన్ డాలర్ కు పైచిలుకు విలువ కలిగినటువంటి ఒక రంగాన్ని సంబాళి స్తున్నటువంటి పర్యటన మంత్రులు అయి ఉండి, మీకు స్వయం గా ఒక యాత్రికుడు అయ్యే అవకాశం దక్కడం అనేది ఎంతో అరుదైంది అని చెప్పాలి. అయితే, మీరు ప్రస్తుతం భారతదేశం లో ఒక ప్రధానమైన పర్యటన కేంద్రం అయినటువంటి గోవా లో ఉన్నారు. ఈ కారణం గా, గోవా లో ని ప్రాకృతిక శోభ తో పాటు గోవా యొక్క ఆధ్యాత్మిక పార్శ్వాన్ని సైతం దర్శించడానికని మీరు మీ యొక్క తీవ్ర చర్చ ల నుండి కొంత కాలాన్ని కేటాయించండి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

జి 20 పర్యాటక మంత్రులనుద్దేశించి ప్రధాని ప్రసంగం

June 21st, 02:29 pm

ఈ రోజు గోవాలో జరిగిన జి 20 పర్యాటక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశంలో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'అపురూపమైన భారతదేశం' భావన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, పర్యాటక శాఖల మంత్రులు ప్రపంచవ్యాప్తంగా రెండు ట్రిలియన్లకు పైబడ్డ రంగాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పర్యాటక శాఖామంత్రులు తామే పర్యాటకులుగా మారే పరిస్థితి చాలా అరుదైన అవకాశంగా అభివర్ణించారు. భారతదేశంలోని పేరుమోసిన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన గోవాలో పర్యాటక మంత్రుల సమావేశం జరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అతిథులు తమ చర్చల బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని గోవా సహజ అందాలను, ఆధ్యాత్మిక శోభను తిలకించటానికి కేటాయించాలన్నారు.

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 02:43 pm

నేటి సమావేశంలో కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ జీ, శ్రీ మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ పీయూష్ గోయెల్ జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ; గయానా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్ మరియు గాంబియా నుండి గౌరవనీయ మంత్రులు; ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు; దేశంలోని స్టార్టప్ ప్రపంచంలోని వివిధ ఎఫ్.పి.ఓ లు మరియు యువ స్నేహితులు; దేశంలోని ప్రతి మూల హాజరైన లక్షల మంది రైతులు; ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం

March 18th, 11:15 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్‌ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్‌ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

March 02nd, 09:38 am

జి-20 విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాని కి మిమ్ముల ను అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణం లో ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది. ఇది ఉద్దేశ్యం తాలూకు ఏకత్వం మరియు కార్యాచరణ తాలూకు ఏకత్వం అనేవి ఎంతైనా అవసరం అని సూచిస్తున్నది. ఈ రోజు న జరుతున్న ఈ మీ యొక్క సమావేశం ఉమ్మడి లక్ష్యాల మరియు నిర్దిష్ట ఉద్దేశ్యాల సాధన కోసం గుమికూడిన భావన కు అద్దం పడుతుంది అని నేను ఆశపడుతున్నాను.

జి-20 విదేశాంగ మంత్రులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 02nd, 09:37 am

ఈరోజు జరిగిన జి-20 విదేశాంగమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశమిచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు నెరపుతున్న భారతదేశం ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ భావను ఎంచుకోవటానికి కారణాన్ని ప్రస్తావించారు. లక్ష్య నిర్దేశంలోనూ, కార్యాచరణలోనూ ఐక్యమత్యపు అవసరాన్ని ఈ భావన నొక్కి చెబుతుందన్నారు. ఉమ్మడి లక్ష్య సాధనకోసం అందరూ దగ్గరవటమనే స్ఫూర్తిని ఈరోజు సమావేశం ప్రతిబింబిస్తున్నదన్నారు.

Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi

November 08th, 07:31 pm

PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.

వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష‌త థీమ్‌, వెబ్ సైట్‌, లోగోల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి

November 08th, 04:29 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష లోగో, థీమ్‌, వెబ్ సైట్ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఆవిష్క‌రించారు.