భారతదేశం మారుతుంది. గ్లోబల్ వేదికపై భారతదేశం ఉన్నత స్థానంలో నిలుస్తుంది, జన శక్తి దానికి కారణం: ప్రధాని

September 11th, 11:18 am

'యంగ్ ఇండియా, న్యూ ఇండియా' నేపథ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు. చికాగోలో జరిగిన స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తుచేసుకుంటూ, ప్రధాని మోదీ ప్రసంగించారు, కొన్ని మాటలతోనే, భారతదేశం నుండి వెళ్ళిన యువకుడు ప్రపంచాన్ని గెలిచాడు మరియు ప్రపంచానికి ఏకత్వ శక్తిని చూపాడు. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు నుండి చాలా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు.

శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగానికి 125వ సంవ‌త్స‌రం రావడం మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటైన విద్యార్థుల స‌మ్మేళనం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 11th, 11:16 am

స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్ర‌సంగం 125వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వం.. ఈ రెండు ఘట్టాల సంద‌ర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు నిర్వ‌హించిన విద్యార్థుల స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని ప్ర‌సంగించారు.