లోక్ సభ కు స్పీకరు గా శ్రీ ఓం బిర్ లా ఎన్నికైన సందర్భం లో ఆయనకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

June 26th, 02:35 pm

లోక్ సభ కు స్పీకర్ గా శ్రీ ఓం బిర్ లా ను రెండో సారి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. క్రొత్త గా ఎన్నికైన స్పీకర్ యొక్క అంతర్ దృష్టి మరియు అనుభవం సభ ఎంతగానో లాభం చేకూరుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

సభాపతి ఎన్నిక అనంతరం 18వ లోక్ సభలో ప్రధాని ప్రసంగం పాఠం

June 26th, 11:30 am

మీరు రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికవడం సభ అదృష్టం. మీతో పాటు సభ మొత్తానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

స్పీకర్ ఎన్నికైన తరువాత లోక్ సభ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

June 26th, 11:26 am

వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని వీడియో సందేశం

January 27th, 04:00 pm

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు, శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గారు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ప్రిసైడింగ్ అధికారులు.

ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

January 27th, 03:30 pm

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, “మన రాజ్యాంగం యొక్క 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 75వ గణతంత్ర దినోత్సవం ముగిసిన వెంటనే ఈ సదస్సు జరగడం వల్ల ఈ సదస్సుకు అదనపు ప్రాముఖ్యత ఉంది” అని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యులకు నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ అన్నారు.

‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

February 21st, 11:26 am

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టిన ‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రశంసించారు. ‘సుపోషిత్ మా అభియాన్’ ను కోటా లోని రామ్ గంజ్ మండీ ప్రాంతం లో శ్రీ ఓం బిర్ లా ప్రారంభించారు. ప్రతి ఒక్క మాతృమూర్తి ని మరియు శిశువు ను ఆరోగ్యవంతం గా ఉంచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ధ్యేయం గా ఉంది.

రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

July 23rd, 10:16 pm

రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం పార్లమెంట్ లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 20th, 10:31 am

కార్యక్రమంలో మాతో పాటు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రా జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ కిషన్ రెడ్డి జీ, భూపేందర్ యాదవ్ జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, పురుషోత్తమ్ రూపాలా జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, బ్రహ్మ కుమారీల కార్యనిర్వాహక కార్యదర్శి రాజయోగి మృత్యుంజయ జీ, రాజయోగిని సోదరి మోహిని సోదరి చంద్రికా జీ, బ్రహ్మ కుమారీల సోదరీమణులు, లేడీస్ అండ్ జెంటిల్మన్, యోగులందరూ!

‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’యొక్క జాతీయ ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

January 20th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా కు ఆయన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

November 23rd, 04:16 pm

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా కు ఆయన పుట్టిన రోజుసందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ

September 15th, 06:32 pm

ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌స‌భ‌ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం

September 15th, 06:24 pm

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌స‌భ‌ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంసద్టివి ని సెప్టెంబర్ 15న కలసి ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ లు

September 14th, 03:18 pm

సంసద్ టివి ని భారతదేశం ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా లు 2021 సెప్టెంబర్ 15న సాయంత్రం 6 గంటల కు పార్లమెంట్ హౌస్ ఉప భవనం లోని ప్రధాన కమిటీ రూమ్ లో సంయుక్తం గా ప్రారంభించనున్నారు. అదే రోజు న ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం కూడా కావడం అనేది యాదృచ్చికం.

స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా ఆయన పదవీ కాలం లో రెండు సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

June 19th, 03:25 pm

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్ లా ను ఆయన పదవీకాలం లో రెండేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనల ను తెలియజేశారు.