డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
April 09th, 12:18 pm
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.డాక్టర్‌హరేకృష్ణ మెహతాబ్ రచన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించినప్రధాన మంత్రి
April 09th, 12:17 pm
‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచన అయిన ‘ఒడిశా ఇతిహాస్’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇంతవరకు ఒడియా లోను, ఇంగ్లీషు లోను లభ్యమవుతూ వచ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంకర్ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి తర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచించిన ఒడిశా ఇతిహాస్ తాలూకు హిందీ గ్రంథాన్ని ఈ నెల 9న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
April 07th, 01:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని జన్‌పథ్ లో గల ఆంబేడ్కర్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కు ‘ఒడిశా ఇతిహాస్’ గ్రంథం తాలూకు హిందీ అనువాదాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని ‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచించారు. ఇంతవరకు ఒడియా, ఇంగ్లీషు భాషల లో లభ్యమవుతున్న ఈ పుస్తకాన్ని శ్రీ శంకర్‌లాల్ పురోహిత్ హిందీ లోకి అనువాదం చేశారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా పాలుపంచుకోనున్నారు. హిందీ అనువాద గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమాన్ని హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.