ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రముఖులతో ప్రధానమంత్రి భేటీ

March 01st, 04:07 pm

న్యూదిల్లీలోని భారత్ మండపం వేదికగా నేడు నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇందులో కార్లోస్ మాంటెస్, ప్రొఫెసర్ జొనాథన్ ఫ్లెమింగ్, డాక్టర్ ఆన్ లీబర్ట్, ప్రొఫెసర్ వెసెల్లిన్ పోపౌస్కీ, డాక్టర్ బ్రియాన్ గ్రీన్, అలెక్ రాస్, ఓలెగ్ ఆర్టెమియేవ్, మైక్ మాసిమినో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

శ్రీలంక మాజీ అధ్యక్షుడితో ప్రధాని భేటీ

March 01st, 02:35 pm

ఢిల్లీలో ఎన్ ఎక్స్ టి సమావేశం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక మాజీ అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమసింఘేతో భేటీ అయ్యారు.

ఆస్ట్రేలియా మాజీ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

March 01st, 02:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్‌తో భేటీ అయ్యారు.

‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 01st, 11:00 am

‘న్యూస్‌ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది... ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్‌), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్‌) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.

ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 10:34 am

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.