గౌరవనీయులు రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడిన - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 10:35 pm
ఉక్రెయిన్ కు సంబంధించి ఇటీవలి పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి కి వివరించారు. రష్యా మరియు నాటో బృందం మధ్య ఉన్న విభేదాలను నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని ప్రధానమంత్రి తమ దీర్ఘ కాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. హింసను తక్షణమే నిలిపివేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, దౌత్యపరమైన చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడానికి అన్ని వైపుల నుండి సంఘటిత ప్రయత్నాలు చేయాలని, ఆయన పిలుపునిచ్చారు.