ఆచార్య వినోబా భావే కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
September 11th, 11:06 pm
ఆచార్య వినోబా భావే జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధపూర్వక నమస్సులు అర్పించారు.యుగాండా పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
July 25th, 01:00 pm
ఈ మహనీయమైన చట్ట సభ ను ఉద్దేశించి ప్రసంగించే ఆహ్వానాన్ని అందుకోవడం నాకు లభించిన అరుదైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. కొన్ని ఇతర దేశాల చట్టసభల్లోనూ ప్రసంగించే అవకాశం నాకు లభించింది; అయినప్పటికీ, ఇది మాత్రం చాలా విశిష్టమైంది. ఇటువంటి గౌరవం భారతదేశ ప్రధాన మంత్రి కి లభించడం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప సత్కారం. వారు అందరి స్నేహపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీస్సులను ఈ చట్ట సభ కోసం.. యుగాండా ప్రజలు అందరి కోసం నేను మోసుకొచ్చాను. గౌరవనీయురాలైన మేడమ్ స్పీకర్ గారూ, మీరు అధ్యక్ష స్థానంలో ఉండడం నాకు మా లోక్ సభ ను గుర్తుకు తెస్తోంది. అక్కడ కూడా స్పీకర్ గా ఒక మహిళ ఉండడం ఇందుకు కారణం. ఇక ఈ చట్ట సభ లో యువ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి శుభకరం. నేను యుగాండా కు వచ్చినప్పుడల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ నన్ను మంత్రముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌందర్యానికి, గొప్ప సహజ వనరుల సంపద కు, సుసంపన్న వారసత్వానికి నిలయంగా ఉంది. ఇక్కడి నదులు, సరస్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగరకత లను పెంచి పోషించాయి.మా దేశం యొక్క శక్తిని జిఎస్టి ప్రదర్శిస్తుంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
July 30th, 11:01 am
మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ జిఎస్టిని 'గుడ్ అండ్ సింపుల్ టాక్స్'గా అభివర్ణించారు, అది దేశం యొక్క ఆర్ధికవ్యవస్థలో వేగవంతమైన వేగంతో సానుకూల మార్పు తీసుకువచ్చింది. జిఎస్టి యొక్క మృదువైన అమలు రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సహకారం ప్రశంసలు అందుకుంది. భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ ఉద్యమం, 75 ఏళ్ళ క్విట్ ఇండియా ఉద్యమం మరియు దాని గొప్ప పాత్ర గురించి ప్రధాని మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాలలో వరదలు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.