న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

July 16th, 08:10 pm

దేశం ప్ర‌స్తుతం ఒక ప‌రివ‌ర్త‌న కాలం గుండా ప్ర‌యాణిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం ప్ర‌స్తుతం ప్ర‌పంచం లో అత్యంత వేగంగా వ‌ర్ధిల్లుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ, ఒక అంత‌ర్జాతీయ నివేదిక క‌థ‌నం ప్ర‌కారం భార‌త‌దేశం లో పేద‌రికం ఒక ప్రమాణ గతితో క్షీణిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం కేవలం ఒక స‌మ‌న్వ‌య క‌ర్త పాత్ర‌ను పోషిస్తుంద‌ని, అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకొంటోంది యువతీయువకులే అని, దీంతోపాటు వారు తమంత తాముగా కొత్త అవ‌కాశాల‌ను కూడా సృష్టిస్తున్నారని ఆయ‌న తెలిపారు.

నవ భారత దేశ నిర్మాణంతో భారతదేశాన్ని ప్రతీవిషయంలో భవిష్యత్తుభరితం చేస్తున్నాం: ప్రధాని మోదీ ప్రధాని మోదీ

July 16th, 08:10 am

న్యూ ఇండియా కాన్క్లేవ్ యొక్క ముగింపు కార్యక్రమంలో, దేశాభివృద్ధికి యువ భారతదేశం శక్తినిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. యువత ఆకాంక్షలు, శక్తి లాగానే, భారతదేశం ఉన్నతంగానూ, పరివర్తన విషయాలు చేపడుతుందన్నారు. ప్రతి పౌరుడి యొక్క భవిష్యత్తు మెరుగుపడినప్పుడు, భారతదేశం యొక్క భవిష్యత్తు మరియు ప్రపంచంలో భారతదేశం యొక్క పరపతి అభివృద్ధి చెందుతుంది, అని అన్నారు.