అక్టోబరు 20న వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన

October 19th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2:00 గంటలకు ఆర్‌జె శంకర నేత్ర వైద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు నగరంలో అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

బిహార్‌లోని బిహ్తాలో రూ.1413 కోట్ల అంచనా వ్యయంతో నూతన పౌర విమానయాన సదుపాయానికి కేబినెట్ ఆమోదం

August 16th, 09:27 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బీహార్‌ పాట్నాలోని బిహ్తాలో రూ.1413 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా పౌర విమానయాన సదుపాయం అభివృద్ధి చేసేందుకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రా విమానాశ్రయంలో రూ.1549 కోట్ల అంచనా వ్యయంతో నూతన పౌర విమానయాన సదుపాయానికి మంత్రివర్గం ఆమోదం

August 16th, 09:22 pm

ప్రతిపాదిత కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనం 70,390 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో రద్దీ సమయాల్లో 3000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో రానుంది. దీని వార్షిక సామర్థ్యం 10 మిలియన్ల మంది ప్రయాణీకులు. ఏ-321 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనువైన 10 పార్కింగ్ బేలు, అలాగే రెండు లింక్ టాక్సీవేలు, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్‌లను ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగిన ఒక అప్రాన్ నిర్మాణం ఈ ప్రాజెక్ట్లో ముఖ్య భాగాలు. పర్యావరణ బాధ్యతను నొక్కి చెబుతూ, టెర్మినల్ భవనం గ్రీన్ బిల్డింగ్‌గా ఉంటుంది, పునరుత్పాదక ఇంధన వనరులను ఏకీకృతం చేస్తుంది. పర్యావరణ దుష్పరిణామాలను తగ్గించడానికి సహజ కాంతిని పెంచుతుంది.