ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
October 21st, 10:25 am
ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 21st, 10:16 am
గత నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భవిష్యత్తు సంబంధిత ఆందోళనలపై చర్చలు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భారత్ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.