భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.