
దుర్గా నవరాత్రి నేపథ్యంలో మాతా రాణి పావన నవరూప ఆరాధన ప్రాశస్త్యం వివరించిన ప్రధానమంత్రి
April 05th, 09:02 am
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా రాణి దివ్య నవరూప ఆరాధన ప్రాశస్త్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. దీంతోపాటు మాతపై ఓ భక్తి గీతాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
మాతా జగదాంబ అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషాలు : ప్రధాన మంత్రి
April 04th, 08:28 am
మాతా జగదాంబ కృపతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషం వెల్లివిరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన ప్రార్థన గీతాన్ని ఆయన పంచుకున్నారు.
నవరాత్రుల్లో దుర్గామాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్ప బలం సిద్ధిస్తాయి: ప్రధాని
April 03rd, 06:57 am
నవరాత్రుల్లో దుర్గా మాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్పం లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన భజన గీతాన్ని పంచుకున్నారు.మాత అంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రి పవిత్రత్వాన్ని మననం చేసుకొన్న ప్రధానమంత్రి
April 02nd, 10:06 am
మాతా జగదాంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రుల పవిత్రత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకొన్నారు. దేవీ మాత విభిన్న రూపాలకు అంకితం చేసిన ఒక ప్రార్థనగీతాన్ని ఆయన పంచుకొంటూ, ప్రతి ఒక్కరూ ఈ గీతాన్ని వినవలసిందిగా విజ్ఞప్తి చేశారు.నవరాత్రులలో దేవీ మాత ఆరాధనతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది: ప్రధానమంత్రి
April 01st, 10:02 am
నవరాత్రులలో దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. పండిత్ భీమ్సేన్ జోషి ఆలపించిన ఒక భజనగీతాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు.శాంతి.. ఆనందం.. నూతనోత్తేజ సందేశంతో నవరాత్రి వేడుకలకు ప్రధానమంత్రి పిలుపు
March 31st, 09:10 am
దుర్గా మాత పవిత్ర ఆశీర్వాదాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో వివిధ ప్రగతి పనుల ప్రారంభం.. శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 30th, 06:12 pm
వేదికను అలంకరించిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్ డేకా, ప్రజాదరణగల చురుకైన ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, ఈ ప్రాంత ఎంపీ-కేంద్ర మంత్రి శ్రీ తోఖన్ సాహు, ఛత్తీస్‌గఢ్ శాసనసభాపతి-నా ప్రియ మిత్రులు శ్రీ రమణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సాహు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన నా సోదరీసోదరులారా!ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 30th, 03:30 pm
మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర జీవనోపాధిని పెంపొందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభాలు చేసి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. నూతన సంవత్సర శుభారంభం, నవరాత్రి మొదటి రోజు వంటి శుభ సందర్భంలో ఈ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న శ్రీ నరేంద్ర మోదీ, మాతా మహామాయ భూమిగా, మాతా కౌసల్య మాతృభూమిగా ఛత్తీస్‌గఢ్ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నవరాత్రి మొదటి రోజున ఛత్తీస్‌గఢ్‌లో ఉండటం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్న ఆయన, ఇటీవల భక్త శిరోమణి మాతా కర్మ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ జారీ చేసిన సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. నవరాత్రి పండుగ రామనవమి వేడుకలతో ముగుస్తుందన్న మోదీ, ఛత్తీస్‌గఢ్‌లో రాముడి పట్ల ఉన్న ప్రత్యేక భక్తిని, ముఖ్యంగా తమ మొత్తం ఉనికిని రాముడి నామానికి అంకితం చేసిన రామనామి సమాజ అసాధారణ అంకితభావాన్ని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలను శ్రీరాముని మాతృమూర్తి కుటుంబ సభ్యులుగా అభివర్ణించిన ఆయన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 30th, 11:53 am
గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని
March 30th, 11:52 am
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 30th, 11:37 am
నవరాత్రి సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారిని ఆరాధిస్తూ పండిట్ జస్రాజ్ జీ ఆలపించిన ఒక కీర్తనను ఆయన పంచుకున్నారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు
October 11th, 08:29 am
నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు చేశారు.నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవిని పూజించిన ప్రధాని
October 10th, 07:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవికి ప్రార్థన చేశారు.నవరాత్రి పర్వదినాల ఏడో రోజున కాళరాత్రి అమ్మవారిని అర్చించిన ప్రధానమంత్రి
October 09th, 08:56 am
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడో రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాళరాత్రి అమ్మవారిని అర్చించారు.నవరాత్రి ఆరో రోజు- కాత్యాయనీ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
October 08th, 09:07 am
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.ఆవతీ కలాయ మాడీ వాయ కలాయా’ అంటూ గర్భా గీతాన్ని రాసిన ప్రధానమంత్రి
October 07th, 10:44 am
దేవీమాత దుర్గను స్తుతిస్తూ ‘ఆవతీ కలాయ మాడీ వాయ కలాయ’ అనే పల్లవితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను రాసిన ఒక గర్బా గేయాన్ని ఈ రోజున షేర్ చేశారు.నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి
October 07th, 08:37 am
నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడు, స్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.నవరాత్రి నాలుగో రోజున కూష్మాండ దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి
October 06th, 08:40 am
నవరాత్రి నాలుగోరోజున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు.