ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 25th, 01:00 pm
భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 15th, 11:08 am
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation
January 15th, 10:30 am
PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.'Mission Mausam' aims to make India a climate-smart nation: PM Modi
January 14th, 10:45 am
PM Modi addressed the 150th Foundation Day of IMD, highlighting India's rich meteorological heritage and IMD's advancements in disaster management, weather forecasting, and climate resilience. He launched ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and released the IMD Vision-2047 document.భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 10:30 am
భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్రయాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల సగర్వ పురోగమనానికి కూడా ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 29th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.