శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్-క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం
January 21st, 12:00 pm
ఈ రోజు, ఈ శుభ సందర్భంలో, ఖోడాల్ ధామ్ యొక్క పవిత్ర భూమితో మరియు మా ఖోడాల్ యొక్క అంకితభావం కలిగిన అనుచరులతో కనెక్ట్ కావడం నాకు గౌరవంగా ఉంది. ప్రజాసంక్షేమం, సేవారంగంలో శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్ మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అమ్రేలిలో క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం ఈ రోజు ప్రారంభమైంది. మరికొద్ది వారాల్లో కగ్వాడ్ లోని శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్ స్థాపించి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకోబోతున్నాం. ఈ మహత్తర ఘట్టాలకు అందరికీ నా శుభాకాంక్షలు.శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ వారి కేన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రధాని ప్రసంగం
January 21st, 11:45 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ వారి కేన్సర్ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఖోడల్ ధామ్ పవిత్ర భూమితో, ఖోడల్ మాత భక్తులతో ఈ విధంగా మమేకం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతోషం వెలిబుచ్చారు. అమ్రేలిలో కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రాలకు శంకుస్థాపన ద్వారా శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ ప్రజా సంక్షేమ/సేవా రంగాల్లో మరో ముఖ్యమైన ముందడుగు వేసిందని శ్రీ మోదీ వివరించు. శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్-కాగ్వాడ్ స్థాపించి త్వరలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.Uttarakhand is a state where we experience both divinity and development together: PM Modi
December 08th, 12:00 pm
PM Modi inaugurated ‘Uttarakhand Global Investors Summit 2023. Reiterating his close association with Uttrakhand, PM Modi said that Uttrakhand is a state where one feels pinity and development simultaneously. He added that Aspirational India desires a stable government rather than instability.‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 08th, 11:26 am
ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ లో గల ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జరుగుతున్న ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించడం తో పాటు, గ్రౌండ్ బ్రేకింగ్ వాల్ ను కూడా ఆవిష్కరించారు. సశక్త్ ఉత్తరాఖండ్ ను మరియు బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ‘శాంతి నుండి సమృద్ధి’ అనేది ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉంది.మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 11:30 am
మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.2023 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం 100వ భాగంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 30th, 11:31 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్. నాకు మీ అందరి నుండి వేల ఉత్తరాలొచ్చాయి. లక్షల సందేశాలొచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి, చూడడానికి ప్రయత్నించాను. సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు ఉద్వేగానికి గురయ్యాను. భావోద్వేగాలతో నిండిపోయాను. భావోద్వేగాల్లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ సందర్భంగా మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. వాస్తవానికి అభినందనలకు అర్హులు మీరు- మన్ కీ బాత్ శ్రోతలు- మన దేశ వాసులు. 'మన్ కీ బాత్' కోట్లాది భారతీయుల 'మన్ కీ బాత్'. వారందరి భావాల వ్యక్తీకరణ.ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస
April 22nd, 09:53 am
ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.గౌహతిలో బిహు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 14th, 06:00 pm
రొంగలీ బిహు సందర్భంగా అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!అస్సాం లోని గువాహటిలో రూ. 10,900 కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని
April 14th, 05:30 pm
అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.నాగా సంస్కృతి అనేది హుషారు, పరాక్రమం మరియుప్రకృతి పట్ల గౌరవం లకు సమానార్థకం గా ఉంది: ప్రధాన మంత్రి
April 06th, 11:24 am
నాగాలాండ్ ప్రభుత్వం లో పిహెచ్ఇడి మరియు సహకార శాఖ మంత్రి గా ఉన్నటువంటి శ్రీ జేకబ్ ఝిమోమీ చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ‘‘జి-20 కార్యక్రమాల లో భాగం గా ఉన్నటువంటి ఒక కార్యక్రమం లో, విశిష్టమైనటువంటి నగా సంస్కృతి ని ఒక మంచి ట్వీట్ ల మాలిక ద్వారా కళ్లకు కట్టడం జరిగింది. నగా సంస్కృతి అంటే అది హుషారు, పరాక్రమం మరియు ప్రకృతి పట్ల గౌరవ భావం లకు పర్యాయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.కర్ణాటకలోని శివమొగ్గలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 27th, 12:45 pm
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని నిలబెట్టిన రాష్ట్రకవి కువెంపు జన్మభూమికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నేడు కర్ణాటక అభివృద్ధికి దోహదపడే కోట్లాది రూపాయల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, ప్రారంభించే అదృష్టం నాకు మరో సారి లభించింది.కర్ణాటకలోనిశివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగావిలువైన అనేకఅభివృద్ధి ప్రాజెక్టులకుప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధాని
February 27th, 12:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని శివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. దీంతోపాటు శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో శివమొగ్గ- షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైలుమార్గం, కోటగంగూరు రైల్వే కోచ్ డిపో ఉన్నాయి. అంతేకాకుండా రూ.215 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జల్ జీవన్ మిషన్ కింద రూ.950 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే పలు గ్రామీణ పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కూడా చేశారు. అటుపైన శివమొగ్గ నగరంలో రూ.895 కోట్లతో చేపట్టిన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ‘ఆది మహోత్సవం’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 16th, 10:31 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండా, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీమతి రేణుకా సింగ్, డాక్టర్ భారతీ పవార్, శ్రీ బిశేశ్వర్ తుడుసహా ఇతర ప్రముఖులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల నా గిరిజన సోదరసోదరీమణులారా! ఆది మహోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ ప్రారంభించిన ప్రధాని
February 16th, 10:30 am
జాతీయ గిరిజన మహోత్సవమైన ఆది మహోత్సవ్ ను ఢిల్లీలోని మేజర్ ధ్యాన చంద్ నేషనల్ స్టేడియంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని జాతీయ వేదికమీద ప్రదర్శించే ప్రయత్నమే ఆది మహోత్సవ్. ఆ విధంగా గిరిజనుల సంస్కృతి, హస్త కళలు, ఆహార సంప్రదాయాన్ని, వాణిజ్యాన్ని, సంప్రదాయ కళలను ప్రదర్శించే వార్షిక కార్యక్రమమిది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని ముందుగా భగవాన్ బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించి ఎగ్జిబిషన్ లోని స్టాల్స్ అన్నీ కలియదిరిగారు.అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శనపై ప్రధానమంత్రి ప్రశంసలు
January 04th, 11:34 pm
ప్రకృతి ఆరాధకులు, పుష్ప సోయగంపై మక్కువచూపే అభిమానులను అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకర్షించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు.ఆకాశమే హద్దు కాదు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 27th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం... మీ అందరికీ మరోసారి 'మన్ కీ బాత్'లోకి స్వాగతం. ఈ కార్యక్రమం 95వ ఎపిసోడ్. 'మన్ కీ బాత్' వందో సంచిక వైపు మనం వేగంగా దూసుకుపోతున్నాం. 130 కోట్ల మంది దేశప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యమం. ప్రతి ఎపిసోడ్‌కు ముందుగ్రామాలు, నగరాల నుండి వచ్చే చాలా ఉత్తరాలను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాలు వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.Investing in India means investing in inclusion, investing in democracy: PM Modi
November 02nd, 10:31 am
PM Modi addressed the inaugural function of Invest Karnataka 2022, the Global Investors Meet of the state via video conferencing. “Investing in India means investing in inclusion, investing in Democracy, investing for the world, and investing for a better, cleaner and a safer planet”, the Prime Minister remarked.‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
November 02nd, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత- నిన్న కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్న రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక విశిష్టతను వివరిస్తూ… ఈ రాష్ట్రం సంప్రదాయం, సాంకేతికత, ప్రకృతి-సంస్కృతి, అద్భుత వాస్తుశిల్పం, శక్తిమంతమైన అంకుర సంస్థల సమ్మేళనమని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతిభ లేదా సాంకేతికత విషయంలో ముందుగా మదిలో మెదిలేది ‘బ్రాండ్ బెంగుళూరు’. ఈ పేరు దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు.కునో నేషనల్ పార్క్ లో చీతాల (చిరుతపులులలో ఒక రకం) విడుదల వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 17th, 11:51 am
గతాన్ని సరిదిద్దడానికి, కొత్త భవిష్యత్తును నిర్మించడానికి కాలచక్రం మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా అరుదుగా మానవాళి అటువంటి సందర్భాలను ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తూ, ఈ రోజు మన ముందు అలాంటి ఒకట క్షణం ఉంది. దశాబ్దాల క్రితం విచ్ఛిన్నమై, అంతరించిపోయిన జీవవైవిధ్యం యొక్క పురాతన బంధాన్ని మళ్లీ కనెక్ట్ చేసే అవకాశం నేడు మనకు లభించింది. నేడు చిరుతలు భారత గడ్డపైకి తిరిగి వచ్చాయి. మరియు ఈ చిరుతలతో పాటు, భారతదేశంలోని ప్రకృతిని ప్రేమించే స్పృహ కూడా పూర్తి శక్తితో మేల్కొల్పబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలందరికీ నా అభినందనలు.