తొలి జాతీయ శిక్షణ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం
June 11th, 06:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రంలో తొట్టతొలి జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా తన అపార రాజకీయ-పాలనానుభవం ఆధారిత వృత్తాంతాలు, కథనాలతో ఆయన ప్రసంగం కొనసాగింది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరులో సేవా దృక్పథం, సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడంలో కర్తవ్య నిర్వహణ వంటి అంశాలపై పలు ఉదాహరణలను ఉటంకించారు. అంతేకాకుండా వ్యవస్థ నిర్వహణలో అధికార సోపాన క్రమాన్ని అధిగమించడంతోపాటు ప్రతి ఒక్కరి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే ప్రజా భాగస్వామ్యానికిగల ప్రాధాన్యం, వ్యవస్థను నిత్యనూతనంగా రూపొందిస్తూ నవోత్తేజం నింపడంలో ఉత్సాహం చూపడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ సిబ్బంది కర్తవ్య నిర్వహణలో ఈ అంశాలను అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సు ప్రారంభించనున్న ప్రధాని దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వీసుల శిక్షణా సంస్ఠల ప్రతినిధుల హాజరు సివిల్ సర్వెంట్ల శిక్షణ మౌలిక సదుపాయాల పటిష్టానికి, సంస్థల మధ్య సహకారానికి సదస్సు దోహదం
June 10th, 10:40 am
మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 11 ఉదయం పదిన్నరకు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.