9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ

September 11th, 11:01 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.

స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ గావించిన ప్ర‌ధాన‌మంత్రి, స‌ర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 క‌న్యాఛాత్రాల‌య‌కు భూమి పూజ

September 11th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అలాగే స‌ర్దార్ ధామ్ ఫేజ్ -2 క‌న్యా ఛాత్రాయ‌ల‌య‌కు ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. గ‌ణేశ్ ఉత్స‌వ్ సంద‌ర్భంగా స‌ర్దార్ ధామ్ భ‌వ‌న్ ప్రారంభం అవుతుండ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌ణేశ్ చ‌తుర్థి ఉత్స‌వాలు, రుషి పంచ‌మి , క్ష‌మ‌వాణి దివ‌స్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తి ఒక్క‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌ర్దార్‌ధామ్ ట్ర‌స్ట్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. మాన‌వాళి సేవ‌కు వారు అంకిత‌భావంతో చేస్తున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేద‌లు, ప్ర‌త్యేకించ మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో వారి శ్ర‌ద్ధను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

టెక్స్‌టైల్స్‌ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్‌ వ్యాపారంలో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.

September 08th, 02:49 pm

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్‌ అపెరల్, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్‌,ఆర్‌ఓడిటిఈపి మరియు ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.