సెప్టెంబర్ 17న మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

September 15th, 02:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం సుమారు 10:45 నిమిషాల ప్రాంతం లో కొన్ని చీతాల ను ప్రధాన మంత్రి కూనో నేశనల్ పార్క్ లో ఉండడానికి గాను వదలి పెడతారు. ఆ తరువాత మిట్టమధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల వేళ కు ఆయన శ్యోపుర్ లోని కరాహల్ లో జరిగే మహిళా స్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్ తో కలసి ఎస్ హెచ్ జి సమ్మేళనం లో పాల్గొననున్నారు.

‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 12th, 12:32 pm

ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !

‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి

August 12th, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఆగస్టు 12న ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ లో పాల్గొననున్న ప్రధాన మంత్రి

August 11th, 01:51 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 12 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఆత్మ నిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొని, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ప్రోత్సాహం లభించిన మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తో మాట్లాడనున్నారు. ఇదే కార్యక్రమం లో వ్యవసాయ సంబంధ జీవనోపాధుల సార్వజనీకరణ అంశం పై వివరణ నిచ్చే పుస్తకం తో పాటు దేశ వ్యాప్త ఎస్ హెచ్ జి మహిళా సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.