సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. స్వయం సమృద్ధి/ఆహార భద్రత లక్ష్యంతో ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై).. ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల’ (కెవి)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

October 03rd, 09:18 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.

2024-25 నుంచి 2030-31 కాలానికి వంటనూనెలు,

October 03rd, 09:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంటనూనెలు-నూనెగింజలపై జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు వంటనూనెల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించేలా చేసే (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యంతో ఈ మిషన్ ను రూపొందించారు. రూ.10,103 కోట్ల వ్యయంతో 2024-25 నుంచి 2030-31వరకు ఏడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

February 24th, 10:13 am

మంత్రివర్గంలోని నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యారంగానికి చెందిన సహచరులందరూ, కృషి విజ్ఞాన కేంద్రాలతో అనుబంధం ఉన్న మన రైతు సోదర సోదరీమణులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!

వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పైఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 24th, 10:03 am

వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తీసుకు రాగల సకారాత్మక ప్రభావం అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచడం కోసం బడ్జెటు తోడ్పాటు ను అందించగల మార్గాల ను గురించి ఆయన చర్చించారు. ‘స్మార్ట్ ఎగ్రికల్చర్’ - అమలు సంబంధి వ్యూహాలు అనే విషయం పై ఈ వెబినార్ లో దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ మరియు విద్య రంగాల ప్రతినిధుల తో పాటు వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల మాధ్యమం ద్వారా రైతులు పాలుపంచుకొన్నారు.

పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 01st, 12:31 pm

ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్‌ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘పీఎం-కిసాన్‌ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి

January 01st, 12:30 pm

దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్‌) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది

August 18th, 11:54 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆయిల్ పామ్‌పై ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) అనే ఈ కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. వంట నూనెల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేయడం ముఖ్యం. ఆయిల్ పామ్ ఉత్పాదకత పెంపుపై ఈ పథకం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.