చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్రసంగ పాఠం

September 28th, 11:01 am

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!

ప్రత్యేక లక్షణాలుగ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

September 28th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు గ‌ల 35 పంట ర‌కాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి, రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్య‌ట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. వ్య‌వ‌సాయంలో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న రైతుల‌తోనూ, ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.

ప్రత్యేకలక్షణాలు గల 35 పంట రకాల ను సెప్టెంబర్ 28న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి

September 27th, 09:41 pm

జలవాయు అనుకూల సాంకేతికతల పట్ల చైనత్యాన్ని పెంచే ప్రయాస లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తం గా ఐసిఎఆర్ కు చెందిన అన్ని ఇన్స్ టిట్యూట్ లలో, రాష్ట్రాల లోని మరియు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల లో, కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికెస్) లో నిర్వహించే ఒక అఖిల బారతీయ కార్యక్రమం లో ప్రత్యేక లక్షణలు గల 35 రకాల పంటల ను దేశానికి సమర్పణం చేయనున్నారు. ఈ కార్యక్రమం సాగే క్రమం లో ప్రధాన మంత్రి నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రేస్ మేనేజ్ మెంట్, రాయ్ పుర్ లో కొత్త కేంపస్ ను కూడా దేశానికి అంకితం చేస్తారు.